వాషింగ్టన్: ఐసీస్ చీఫ్  అబూ బకర్ అల్ బాగ్దాదీ మృతి చెందినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు.

అమెరికా సైనికుల ఆపరేషన్  సమయంలో బాగ్దాదీ తనను తాను కాల్చుకొని చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు.సిరియాలో తమ బలగాల దాడిలో బాగ్దాదీ మృతి చెందినట్టుగా ట్రంప్ చెప్పారు.

ఆదివారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. వాషింగ్టన్ లో ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.బాగ్దాదీతో పాటు ఆయన ముగ్గురు పిల్లలు కూడ ఈ ఘటనలో మృతి చెందాడు.బాగ్దాదీ నిరాశతో నిండిపోయిన వ్యక్తి.గా ట్రంప్ పేర్కొన్నారు. 

ఆదివారం నాడు ఉదయం ఓ సంచలన విషయాన్ని వెల్లడించనున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. సిరియాలో బాగ్దాదీ లక్ష్యంగా అమెరికా బలగాలు దాడులు జరినట్టుగా ట్రంప్ చెప్పారు.

అయితే తమ బలగాలు దాడులు జరిపిన సమయంలో ట్రంప్ తమ బలగాలను చూసి సొరంగంలో దాక్కొన్నాడని ట్రంప్ ప్రకటించారు. ఐసిస్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని తాము సేకరించినట్టుగా ట్రంప్ ప్రకటించారు.ఐసిస్ చీఫ్ బాగ్దాదీ తో పాటు ఆయన ముగ్గురు పిల్లలు కూడ ఈ మృతి చెందారని ఈ విషయాన్ని శాస్త్రీయంగా కూడ నిర్ధారించుకొన్నామని  ట్రంప్ ప్రకటించారు.

బాగ్ధాదీ అసలు పేరు ఇబ్రహీం ఇబిన్ అవ్వాద్ అల్ -బాద్రి అల్-సమర్రాయి. 1971లో ఇరాక్‌లోని సమర్రా నగరంలో పుట్టాడు. ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ బాగ్ధాద్ నుంచి ఇస్లామిక్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు.

21వ శతాబ్ధం ఆరంభంలో ఇరాక్‌పై అమెరికా ఆక్రమణ తదితర కారణాలతో ఇతను తన నగరంలో ‘జైష్ హల్ అల్ సున్నా అల్-జమా’’అనే ఒక చిన్న సున్నీ తిరుగుబాటు సంస్థను స్థాపించాడు.

ఆ తర్వాత 2004 ఫిబ్రవరిలో అమెరికా బలగాలు ఫలుజాలో బాగ్ధాదీని అదుపులోకి తీసుకుని.. బాగ్ధాద్‌లోని ‘‘క్యాంప్ బుక్కా’’ జైలుకు తరలించి డిసెంబర్‌లో విడుదల చేశాయి. జైలు నుంచి విడుదలయ్యాక మరింత రెచ్చిపోయిన అబు బకర్ 2006లో మరికొన్ని ఉగ్రవాద సంస్థలు ఏకం చేసి ‘‘ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్‌’’గా ఏర్పాటు చేశాడు.

Also Read:లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం

తదనంతర కాలంలో సిరియా అంతర్యుద్ధంలోకి ప్రవేశించిన ఈ సంస్థ.. ఆ దేశంలోని సున్నీ మెజారిటీ ప్రాంతాల్లో పట్టు సాధించింది. 2013 ఏప్రిల్‌లో అక్కడి అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థను తనలో కలుపుకుని ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’’గా మార్చుకుంది.  

ఆదివారం నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ వేడికగా ఐసీస్ చీఫ్  బాగ్దాదీ మృతిచెందిన విషయాన్ని ఆయన ప్రకటించారు. ఈ విషయమై ట్రంప్ ట్వీట్ చేశారు.