ఉక్రెయిన్ కు రష్యాకు యుద్ధం కొనసాగుతోంది. అయితే దీని కోసం రష్యా తన ఆర్మీ బలగాలతో పాటు వైమానిక దళాన్ని కూడా ఉపయోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం బయటపడింది. ఉక్రెయిన్ లో యుద్ధం కోసం రష్యా తన నౌకదళాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆ నౌకదళ ఆస్తులను కాపాడుకోవడంలో శిక్షణ పొందిన డాల్పిన్లు సహాయపడుతున్నాయి. 

ఆధునిక యుద్దంలో డాల్ఫిన్లు కూడా సైనికులుగా ప‌ని చేస్తున్నాయా ? స‌ముద్ర జీవులు ఒక ఒక దేశం కోసం ప‌ని చేస్తున్నాయా ? ఒక దేశ సైనిక ఆస్తులు కాపాడ‌టంలో ఇవి కీల‌కంగా వ్య‌వ‌హరిస్తున్నాయా ? ఈ విష‌యాల‌న్నీ విన‌డానికే వింత‌గా అనిపిస్తున్నాయి క‌దూ. అవును.. నిజ‌మే. అమెరికాలోని ఓ ప్ర‌ముఖ పోర్ట‌ల్ ఈ విష‌యానికి సంబంధించిన నివేదిక‌ను వెల్ల‌డించింది. ఈ నివేదిక‌ను చ‌దివితే పైన మ‌నం చ‌ర్చించుకున్న విష‌యాల‌న్నీ వాస్త‌వ‌మే అని అర్థ‌మ‌వుతుంది. 

USNI న్యూస్, యునైటెడ్ స్టేట్స్ స్టే నావల్ ఇన్స్టిట్యూట్ కు చెందిన ఆన్ లైన్ పోర్ట‌ల్ ఈ విష‌యాన్ని ధృవీక‌రించాయి. రష్యా నల్ల సముద్రం నావికా స్థావరాన్ని రక్షించడానికి శిక్షణ పొందిన డాల్ఫిన్లను మోహరించినట్లు త‌న నివేదికలో పేర్కొంది. ఉక్రెయిన్ పై దండయాత్రకు ముందు రష్యా నావికాదళం కీలకమైన సెవాస్టోపోల్ నౌకాశ్రయం ప్రవేశద్వారం వద్ద రెండు డాల్ఫిన్ పెన్నులను ఉంచిందని , ఉపగ్రహ చిత్రాల సమీక్షలను చూపిస్తూ నివేదిక ఇచ్చింది. అయితే ఇదేమీ కొత్త విష‌యం కాదు. శిక్షణ పొందిన డాల్ఫిన్లు లేదా ఇతర సముద్ర జీవుల‌ను కీలకమైన సైనిక స్థావరాలను ‘కాపలా ’ ఉంచడం గతం నుంచే ఉంది. 

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ నౌకాదళం నల్ల సముద్రంలో డాల్ఫి న్ శిక్షణతో సహా అనేక సముద్ర క్షీరదల‌కు శిక్ష‌ణ ఇచ్చి అభివృద్ధి చేసింది. ఈ యూనిట్ సెవాస్టోపోల్ సమీపంలోని కజాచ్యా బుక్తాలో ఉంది. అది నేటికీ ఉంది. అమెరికా కూడా సముద్ర ఆస్తులను కాపాడేందుకు ఇలాంటి కార్య క్రమాలను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. సెవాస్టోపోల్ నౌకాశ్రయం లోపల అనేక విలువైన రష్యన్ నేవీ నౌకలు ఉక్రేనియన్ క్షిపణుల పరిధికి వెలుపల ఏర్పాటు చేసి ఉన్నాయి. అయితే శాటిలైట్ ఫోటోల ప్రకారం సముద్రగర్భం విధ్వంసానికి గురయ్యే అవకాశం ఉంది. డాల్ఫిన్లు కౌంటర్-డైవర్ కార్యకలాపాలతో పని చేయవచ్చని నివేదిక పేర్కొంది.

2018లో విడుద‌ల చేసిన శాటిలైట్ ఫోటోల ప్రకారం నల్ల సముద్రం ఫ్లీట్ కు చెందిన డాల్ఫిన్లను సిరియాలోని టార్టస్ లోని రష్యా కు చెందిన మెడిటరేనియన్ సముద్ర నావికా స్థావరానికి చాలా నెలలు మోహరించారు. గత 10 సంవత్సరాలలో సముద్ర క్షీరదాల కార్యక్రమాలలో రష్యా మిల‌ట‌రీ విస్తృత రీ ఇన్వెస్ట్ మెంట్ లో ఇదంతా భాగం. ఇందులో బ్లాక్ సీ ఫ్లీట్ యూనిట్, ఆర్కిటిక్ లో ఒక ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ ఉంది. ఇది బెలూగా వేల్స్, సీల్స్ తో స‌హా వివిధ రకాల సముద్ర క్షీరదాలను ఉపయోగిస్తుంద‌ని నివేదిక పేర్కొంది. 2019 ఏప్రిల్ 23వ తేదీన ఉత్తర నార్వేలో శిక్షణ పొందిన బెలూగా వేల్ కనిపించింది. స్థానికులు ‘హ్వాల్డిమిర్’ అని ముద్దుగా పిలుచుకునే ఈ తిమింగలం రష్యన్ నేవీ ప్రోగ్రాం నుండి తప్పించుకుందని గతంలో ‘BBC’ తెలిపింది.