కరోనా కాలంలో ఒక్కటైన డాక్టర్, నర్స్
నర్స్ గా పనిచేస్తున్న జాన్ టిప్పింగ్, డాక్టర్ గా పనిచేస్తున్న అన్నలన్ నవరత్నం ఇద్దరు ఒక్కటవాలని నిశ్చయించుకున్నారు. నార్తర్న్ ఐర్లాండ్, శ్రీలంకల నుంచి తమ కుటుంబాలు ఈ కరోనా మహమ్మారి కాలంలో క్షేమంగా ప్రయాణం సాగించలేవు అని భావించి, అందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఈ వేడుకను సాధ్యమైనంత త్వరగా నిర్వహించుకోవాలని అనుకున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండడం, రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆగస్టులో పెళ్లాడదామనుకున్న ఒక నర్స్, డాక్టర్ తమ కుటుంబీకులు హాజరుకాలరేమో అనుకోని వాయిదా వేసుకున్నారు.
కానీ ఎన్ని రోజులు ఇలా వాయిదా వేస్తాము అని అనుకున్నారు కాబోలు, వెంటనే తడువుగా ముహూర్తం ఆగస్టులో ఉన్నప్పటికీ.... వారు వెంటనే వివాహమాడాడు నిశ్చయించుకున్నారు. తమ అతిథులంతా ఆన్ లైన్ ద్వారా చూడగలిగే ఏర్పాట్లు చేసుకున్న వధూవరులు అక్కడి ఒక పురాతన చర్చిలో ఒక్కటయ్యారు.
వివరాల్లోకి వెళితే నర్స్ గా పనిచేస్తున్న జాన్ టిప్పింగ్, డాక్టర్ గా పనిచేస్తున్న అన్నలన్ నవరత్నం ఇద్దరు ఒక్కటవాలని నిశ్చయించుకున్నారు. నార్తర్న్ ఐర్లాండ్, శ్రీలంకల నుంచి తమ కుటుంబాలు ఈ కరోనా మహమ్మారి కాలంలో క్షేమంగా ప్రయాణం సాగించలేవు అని భావించి, అందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఈ వేడుకను సాధ్యమైనంత త్వరగా నిర్వహించుకోవాలని అనుకున్నారు.
అనుకున్నదే తడువుగా పురాతనమైన సెయింట్ థామస్ హాస్పిటల్ లోని చాపెల్ లో సంప్రదించారు. అక్కడి అధికారులు వీరిపెల్లి కోసం అన్ని రకాల పర్మిషన్లను సంపాదించి వీరి పెళ్లిని ఏప్రిల్ లో ఘనంగా నిర్వహించారు.
మే 26వ తేదీనాడు సెయింట్ థామస్ హాస్పిటల్ తమ ట్విట్టర్ అకౌంట్ లో ఈ ఫోటోలను ఉంచింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. అందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలోని ముఖ్యమైన వేడుకలను జరుపుకోవాలని వారు భావించి ఈ వేడుకను జరుపుకున్నారు.