Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్ గుణవర్ధనే: ప్రమాణం చేసిన కొత్త పీఎం

శ్రీలంక ప్రధాన మంత్రిగా దినేష్ గుణవర్ధనే శుక్రవారం నాడు ప్రమాణం చేశారు. శ్రీలంక రాజకీయ  ప్రముఖుల్లో దినేష్ గుణవర్ధనే ప్రముఖుడు.  గతంలో ఆయన పలు మంత్రి పదవులును నిర్వహించారు. 
 

Dinesh Gunawardena sworn in as Sri Lankas new Prime Minister
Author
Colombo, First Published Jul 22, 2022, 11:06 AM IST

కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రిగా Dinesh Gunawardena శుక్రవారం నాడు ప్రమాణం చేశారు. దినేష్ గుణవర్ధనే  శ్రీలంక రాజకీయాల్లో ప్రముఖుడు. ఆయన వయస్సు 73 ఏళ్లు. గుణవర్ధనే గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఈ ఏడాది  ఏప్రిల్ లో అప్పటి  అధ్యక్షుడు గోటబయ రాజపక్సే  గుణవర్ధనేను హోంమంత్రిగా నియమించారు. దినేష్ గుణవర్ధనేను Srilanka  ప్రధానమంత్రిగా నియమించారు  శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే. రాజపక్సే కుటుంబానికి దినేష్ గుణవర్ధనే అత్యంత సన్నిహితుడనే పేరుంది.

 కొలంబోని ఫ్లవర్ రోడ్డులోని ప్రధాని కార్యాలయంలో ఇవాళ దినేష్ గుణవర్ధనే ప్రమాణం చేశారు. గతంలో ఆయన పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్, ప్రావిన్షియల్ కౌన్సిల్స్, స్థానిక ప్రభుత్వం వంటి శాఖలను నిర్వహించారు. గతంలో ఆయన విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios