కరోనా మహమ్మారి హైబ్రిడ్ వేరియంట్ డెల్టాక్రాన్ కేసులు యూకేలో వెలుగుచూశాయి. అంతర్జాతీయ నిపుణులు ఈ కొత్త హైబ్రిడ్ వేరియంట్ డెల్టాక్రాన్‌పట్ల ఆందోళనలు వెలిబుచ్చుతున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో హైబ్రిడ్ వేరియంట్ డెల్టాక్రాన్ వెలుగుచూసింది. డెల్టాక్రాన్ కేసులు గుర్తించిన తర్వాత ఆ కేసులను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు యూకే వైద్యాధికారులు తెలిపారు. అయితే, డెల్టాక్రాన్ వేరియంట్ తీవ్రత, దాని వ్యాప్తి వేగంపై అధికారిక ప్రకటనలేవీ లేవు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రళయం సృష్టించడానికి సిద్ధం అవుతున్నదా? తన రూపాన్ని మరోసారి మార్చుకుని బెంబేలెత్తించనుందా? ఈ అనుమానాలు పాతవే అయినా.. డెల్టాక్రాన్ అనే కొత్త హైబ్రిడ్ వేరియంట్‌తో మరింత బలపడుతున్నాయి. అంతర్జాతీయ నిపుణులు ఈ కొత్త హైబ్రిడ్ వేరియంట్ డెల్టాక్రాన్‌పట్ల ఆందోళనలు వెలిబుచ్చుతున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో హైబ్రిడ్ వేరియంట్ డెల్టాక్రాన్ వెలుగుచూసింది. డెల్టాక్రాన్ కేసులు గుర్తించిన తర్వాత ఆ కేసులను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు యూకే వైద్యాధికారులు తెలిపారు. అయితే, డెల్టాక్రాన్ వేరియంట్ తీవ్రత, దాని వ్యాప్తి వేగంపై అధికారిక ప్రకటనలేవీ లేవు. అయితే,
కరోనావైరస్ డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ల క్యారెక్టరిస్టిక్స్‌ను డెల్టాక్రాన్ వెలువరిస్తున్నదని అధికారులు చెప్పారు.
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ మన దేశంలో విలయాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. లక్షలాది మందిని ఈ వేరియంట్ బలిగొన్నది. ఆక్సిజన్ కొరతతో ఒక్కొక్కరు గింజుకుని మరణించిన హృదయవిదారక దృశ్యాలు అందరినీ ఆవేదనకు గురిచేశాయి. ఆ సెకండ్ వేవ్ కాస్త సద్దుమణగడంతో ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి మన దేశంలో పంజా విసిరింది. తత్ఫలితంగా థర్డ్ వేవ్ వచ్చింది.
డెల్టాక్రాన్‌ను తొలిసారి గతేడాది సైప్రస్‌లో కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సైప్రస్‌లో పరిశోధకుడిగా ఉన్న లియోనైడస్ కొస్ట్రికిస్ తొలిసారి డెల్టాక్రాన్ వేరియంట్‌ను కనుగొన్నారు. తమ బృందం 25 డెల్టాక్రాన్ కేసులను కనిపెట్టిందని ఆయన వివరించారు. ఈ హైబ్రిడ్ వేరియంట్ డెల్టా జీనోమ్‌లోనే ఒమిక్రాన్ వంటి జెనెటిక్ సిగ్నేచర్ ఉన్నట్టు తెలిపారు. కానీ, చాలా మంది నిపుణులు లియోనైడస్ కొస్ట్రికిస్ వాదనను వ్యతిరేకించారు. అది కేవలం ల్యాబ్ ఎర్రర్ అని కొట్టిపారేశారు.
కాగా, కొస్ట్రికిస్ మాత్రం తన వాదనలను సమర్థించుకున్నారు. ఈ కొత్త స్ట్రెయిన్.. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ హైబ్రిడ్ వేరియంట్ అని వాదించారు. అంతేకాదు, హైబ్రిడ్ డెల్టాక్రాన్ వేరియంట్.. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కన్నా వేగంగా వ్యాపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మన దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా కేసుల్లో భారీ తగ్గుదల చోటుచేసుకుని 30 వేల దిగువకు చేరాయి. మరణాలు సైతం తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తున్నది. దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టగా.. మరణాలు సైతం తగ్గాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్త నమోదైన కరోనా వైరస్ కేసులు తగ్గగా, మరణాలు తగ్గాయి. కొత్తగా 27,409 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య మొత్తం 4,26,92,943 కు పెరిగింది. ఇదే సమయంలో 82,817 (RECOVERED) మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రికవరీల సంఖ్య 4,17,60,458 కి పెరిగింది. ప్రస్తుతం 4,23,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనా మహమ్మారితో పోరాడుతూ 347 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజుతో పోలిస్తే మరణాలు సగానికి తగ్గాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,09,358 మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 97.7 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.0 శాతంగా ఉంది.
