బీజింగ్: చైనాలో ఓ రెస్టారెంట్ కుప్పకూలిన ఘటనలో 29 మంది మరణించారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని  అధికారులు తెలిపారు.

ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లో  గల జుక్సైన్ రెస్టారెంట్ కుప్పకూలడంతో 29 మంది మరణించారు. శనివారం నాడు  ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు ప్రకటించారు.  ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ మంత్రిత్వ శాఖాధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు. ఆదివారం నాడు కూడ సహాయక చర్యలను చేపట్టారు. 

దేశ రాజధాని బీజింగ్ కు 630 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.రెస్టారెంట్ లో 80 ఏళ్ల వ్యక్తి బర్త్ డే పార్టీ నిర్వహించారు.ఈ పార్టీకి పెద్ద మొత్తంలో అతిథులు హాజరయ్యారు. బర్త్ డే పార్టీ జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. దీంతోనే ఎక్కువ మంది మరణించారని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ భవనం శిథిలాల కింద చిక్కుకొన్న 59 మందిని సురక్షితంగా బయటకు తీశారు.