Asianet News TeluguAsianet News Telugu

ఇరాన్ దాడుల నుంచి కోలుకోకముందే , సరిహద్దుల్లో పాక్ బలగాలు - ఆఫ్ఘన్ తాలిబాన్ల మధ్య కాల్పులు (వీడియో)

ఇప్పటికే ఇరాన్ వైమానిక దాడులతో కుమిలిపోతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. వివాదాస్పద డ్యూరాండ్ రేఖ వెంబడి వున్న కునార్ - బజౌర్ సరిహద్దు వద్ద గత ఏడు గంటలుగా కాల్పులు జరుగుతున్నాయి. ఇందులో పాకిస్తాన్ దళాలు, ఆఫ్ఘన్ తాలిబాన్ బలగాలు పాల్గొన్నాయి. 

Days after Iran attack, Afghan Taliban clash with Pakistani forces at border (WATCH) ksp
Author
First Published Jan 20, 2024, 9:07 PM IST | Last Updated Jan 20, 2024, 9:14 PM IST

ఇప్పటికే ఇరాన్ వైమానిక దాడులతో కుమిలిపోతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. వివాదాస్పద డ్యూరాండ్ రేఖ వెంబడి వున్న కునార్ - బజౌర్ సరిహద్దు వద్ద గత ఏడు గంటలుగా కాల్పులు జరుగుతున్నాయి. ఇందులో పాకిస్తాన్ దళాలు, ఆఫ్ఘన్ తాలిబాన్ బలగాలు పాల్గొన్నాయి. బలూచిస్తాన్‌లోని తీవ్రవాద స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న రోజుల తర్వాత ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా కాల్పుల సందర్భంగా ఇరుపక్షాల మధ్య ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. 

సరిహద్దు వివాదం కారణంగా పాకిస్తాన్, తాలిబాన్ బలగాల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లు తరచుగా ప్రాణ నష్టానికి దారి తీస్తున్నాయి. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకుని ఉద్రిక్తతలను తగ్గించడానికి కృషి చేస్తూ వుంటారు. అయితే తాజా ఘర్షణకు సంబంధించి ఇరు పక్షాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు. ఆశ్చర్యకరంగా .. పాకిస్తాన్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల సందర్భంగా తాలిబాన్లు.. ఇరు దేశాల మధ్య సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. 

 

 

తాలిబాన్ అధికార ప్రతినిధి అబ్ధుల్ కహర్ బాల్కీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ , ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ ఆందోళనకరంగా భావిస్తోందన్నారు. ఇరుదేశాలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. సుదీర్ఘ సంఘర్షణల తర్వాత ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన శాంతి , స్థిరత్వాన్ని పరిగణనలోనికి తీసుకుని దౌత్యమార్గాలు, సంభాషణల ద్వారా ప్రాంతీయ స్థిరత్వాన్ని పెంపొందించడం, వివాదాలను పరిష్కరించడం కోసం ప్రయత్నాలను నిర్దేశించాల్సిన ప్రాముఖ్యతను బాల్కీ పునరుద్ఘాటించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios