డార్క్ చాక్లెట్స్ లో ప్రమాదకరస్థాయిలో సీసం, కాడ్మియం... హర్షే కంపెనీ ఉత్పత్తులే మొదటి స్థానంలో..
డార్క్ చాక్లెట్లలో ప్రమాదకరస్థాయిలో లెడ్, కాడ్మియం ఉన్నట్లు కన్జ్యూమర్ గ్రూప్ చేసిన పరిశోధనల్లో తేలింది. వీటి స్తాయిలను తగ్గించాలని హార్షే కంపెనీని కోరారు.
న్యూయార్క్ : వివిధ కంపెనీలకు చెందిన చాక్లెట్ ఉత్పత్తుల మీద యూఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ కన్జ్యూమర్ గ్రూప్ ఇటీవల పరీక్షలు నిర్వహించింది. వీటిల్లో వివిధ చాక్లెట్ ఉత్పత్తులలో మూడింట ఒక వంతు సీసం, కాడ్మియం స్థాయిలను కనుగొన్నట్లు కన్స్యూమర్ రిపోర్ట్స్ బుధవారం తెలిపింది.
నాన్ ప్రాఫిట్ కన్జ్యూమర్ గ్రూప్ శాస్త్రవేత్తలు దాదాపు 48 రకాల ఉత్పత్తుల మీద పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 16 ఉత్తత్తులో సీసం, కాడ్మియం లేదా రెండింటినీ హానికరమైన స్థాయిలను కలిగి ఉందని తేల్చారు.
కన్స్యూమర్ రిపోర్ట్‌లు ఏడు విభాగాలలో ఉత్పత్తులను పరీక్షించాయి. డార్క్ చాక్లెట్ బార్‌లు,హాట్ చాక్లెట్ మిక్స్, మిల్క్ చాక్లెట్ బార్‌లు, కోకోవా పౌడర్, చాక్లెట్ చిప్స్, లడ్డూలు, చాక్లెట్ కేక్ లను పరిశోధించారు. వీటిలో వాల్‌మార్ట్ కి చెందిన డార్క్ చాక్లెట్ బార్, హాట్ చాక్లెట్ మిక్స్.. హెర్షేస్, డ్రోస్టే కంపెనీల కోకో పౌడర్, టార్గెట్ బ్రాండ్ సెమీ-స్వీట్ చాక్లెట్ చిప్స్, జోస్, నెస్లే, స్టార్‌బక్స్ లకు చెందిన హాట్ చాక్లెట్ మిక్స్‌లు అధికంగా మెటల్ కంటెంట్‌ను కలిగి ఉన్న ఉత్పత్తులలో ఉన్నాయి.
అమెరికా మైనేలో కాల్పుల కలకలం, 22 మంది మృతి...
కోకో పదార్థాలు తక్కువగా ఉన్న మిల్క్ చాక్లెట్ బార్‌లలో మాత్రమే సీసం, కాడ్మియంలు అధికంగా లేవని తేల్చింది. ఈ లోహాలకు దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ అణిచివేత, మూత్రపిండాలు దెబ్బతింటాయని, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు ఎక్కువ ప్రమాదం ఏర్పడుతుందని కన్స్యూమర్ రిపోర్ట్స్ పేర్కొంది.
గతేడాది డిసెంబర్ లో ఈ యూఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ కన్జ్యూమర్ గ్రూప్ తాము పరీక్షించిన 28 రకాల డార్క్ చాక్లెట్ ఉత్పత్తుల్లో 23 ఉత్పత్తుల్లో సీసం, కాడ్మియం స్థాయిలు అధికంగా ఉన్నాయని తెలిపింది. వీటిల్లోల హార్షేతో పాటు అనేక బ్రాండ్ ల డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ఉత్పత్తుల కంపెనీలో అగ్రస్తానంలో ఉంది హార్షే. అది తమ ఉత్సత్తుల్లో వీటి స్తాయిని తగ్గించుకోవాలని, చాక్లెట్లను సురక్షితమైనవిగా చేయాలని ఫుడ్ పాలసీ అధికారులు కోరుతున్నారు.
దీనిమీద మార్చ్ లో హార్షే కంపెనీ అధికారులు వివరణ ఇస్తూ.. తాము తమ ఉత్పత్తుల్లో వీటి స్తాయిలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అంతేకాదు.. ఈ లోహాలు భూమిలో నుంచి అత్యంత సహజంగా చాక్లెట్ ఉత్పత్తులోకి చేరుతున్నాయన్నారు.