సిత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్ లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలుతున్నాయి. ఈ తుఫాను ప్రభావం వల్ల ఇప్పటి వరకు 7 గురు చనిపోయారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సిత్రాంగ్’ తుపాను సోమవారం ఉదయం బంగ్లాదేశ్ తీరాన్ని తాకింది. తీరాన్ని తాకిన తర్వాత తుపాను పలు చోట్ల విధ్వంసం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు, మిగితా చోట్ల మరో నలుగురు చనిపోయారు. వేలాది మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వెర్రి వెయ్యి విధాలు.. కారుకు లక్ష టపాసులు కట్టి...పేల్చి.. ఓ యూ ట్యూబర్ తిక్క....
అయితే ఈ తుఫానులో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. బర్గునా, నరైల్, సిరాజ్‌గంజ్ జిల్లాలు, భోలా ద్వీప జిల్లాలు తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని విపత్తు మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ ప్రతినిధి తెలిపారు. అదే సమయంలో, కాక్స్ బజార్ తీరం నుండి వేలాది మంది ప్రజలు మరియు పశువులను ఖాళీ చేయించారు.
కాక్స్ బజార్ తీరం నుండి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 28,155 మంది ప్రజలను 2,736 పశువులను తుఫాన్ షెల్టర్ లకు తరలించారని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. కాగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా 576 షెల్టర్లను సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా తుఫాను సహాయం కోసం యూనియన్ పరిషత్ చైర్మన్, ఉపాధి నిర్భయ అధికారి లేదా జిల్లా కమిషనర్ కార్యాలయ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని జిల్లా యంత్రాంగం ప్రజలను కోరింది. సిత్రాంగ్ తుఫానును ఎదుర్కొనేందుకు, కాక్స్ బజార్ జిల్లా యంత్రాంగం ఆదివారం అనేక సన్నాహాలు చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో దాదాపు 104 వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తుపాను వల్ల ప్రజలు నష్టపోతే 323 టన్నుల బియ్యం, 8 లక్షలకు పైగా, 1,198 పొడి ఆహార ప్యాకేజీలు, 350 కార్టన్‌ల పొడి కేకులు, 400 కార్టన్‌ల డైజెస్టివ్ బిస్కెట్‌లను ప్రజల కోసం నిల్వ చేసింది. కాగా.. తుఫాను నష్టం ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటానికి సహాయం చేయాలని కాక్స్ బజార్ డిప్యూటీ కమిషనర్ మామునూర్ రషీద్ కోరారు.
గాజు సీసాలో టపాసులు పేల్చొద్దన్నందుకు.. వ్యక్తిని కత్తితో పొడిచిన మైనర్లు, చికిత్స పొందుతూ మృతి...
ఇదిలా ఉండగా.. సిత్రాంగ్ తుఫాన్ అత్యంత వేగంతో ఈశాన్య దిశగా కదులుతోంది. తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో కోస్తా జిల్లాలైన దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్న 24 గంటల్లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు ఈరోజు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.
