బ్రిటన్ లో రెండో విడత లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో అక్కడ మంగళవారం అర్థరాత్రి నుంచి రెండో దఫా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
బ్రిటన్ లో రెండో విడత లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం చేశారు. కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో అక్కడ మంగళవారం అర్థరాత్రి నుంచి రెండో దఫా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
కరోనా స్ట్రెయిన్ ను అరికట్టడానికి ప్రధాని బోరిస్ జాన్సన్ అత్యవసరం చర్యలు చేపట్టడంతోపాటు జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేయబోతున్నారు.
బుధవారం నుంచి విద్యాలయాలు, దుకాణాలు, క్రీడా ప్రాంతాలు, మైదానాలు అన్నీ మూసేస్తారు. అన్నిరకాల పరీక్షలు రద్దు చేశారు. ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, మందుల దుకాణాలు, పోస్టాఫీసుల్లాంటి అత్యవసర సర్వీసులు మాత్రమే తెరవడానికి అనుమతించారు.
స్నేహితులు, బంధువులు ఎవరైనా బయట కలుపుకోవడం నిషిద్ధం. ఒకరినొకరు మాత్రమే కలుసుకోవాలి. అదీ వారి వారి సొంత ఇంట్లోనే.చర్చిలు, ఇతర ప్రార్థన మందిరాలు తెరవడానికి అనుమతించారు. కానీ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాల్సిందే.
జాతీయ, అంతర్జాతీయ క్రీడల్ని కొన్ని పరిమితులతో అనుమతిస్తున్నారు. కొవిడ్ వాక్సినేషన్, ఇతర వైద్య అవసరాల కోసం ఎవరైనా బైటికి వెళ్లొచ్చు. తోడుగా ఒక్కరు మాత్రమే ఉండాలి.
హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం తినడానికి వీల్లేదు. అక్కడినుంచి బైటికి తీసుకెళ్లచ్చు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి 200 పౌండ్లు సుమారు రూ. 20వేలు జరిమానా విధిస్తారు. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే అత్యధికంగా రూ. 6.36 లక్షలు ఫైన్ కట్టాల్సిందే. ఇక సరైన కారణం లేకుండా బైటికి వచ్చిన వారిని జైలులో వేసే అధికారం పోలీసులకు కల్పించారు.
బ్రిటన్ లో అంతర్భాగమైన వేల్స్ లో డిసెంబర్ 20 నుంచే పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉంది. తాజా సమాచారం ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తరకం కరోనా వైరస్ బారినపడి బ్రిటన్ లో 407మంది మరణించారు. 58,784 మంది పాజిటివ్ గా తేలారు. ఈ లాక్ డౌన్ ఆరువారాల పాటు అమల్లో ఉంటుంది. ఫిబ్రవరి రెండోవారంలో సమీక్షిస్తారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 6, 2021, 1:05 PM IST