Asianet News TeluguAsianet News Telugu

టీకా విషాదం.. వ్యాక్సిన్‌ తీసుకున్న 23 మంది మృతి !

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నార్వేలో వ్యాక్సిన్ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచించింది. 

COVID-19 vaccination: 23 elderly people dead after Pfizer shot in Norway - bsb
Author
Hyderabad, First Published Jan 16, 2021, 1:38 PM IST

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నార్వేలో వ్యాక్సిన్ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచించింది. 

ఫైజర్‌ ఎన్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. వీరిలో 13 మందికి శవపరీక్షలు నిర్వహించగా టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన దుష్ర్పభావాలు.. తీవ్రంగా మారి మరణించారని నార్వేజియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ తెలిపింది. అంతేకాక వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనిపించే సాధారణ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా బాగా బలహీనంగా ఉన్న వారిలో తీవ్రంగా మారాయన్నారు.

అందుకే బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలతో ఉన్న వారు వ్యాక్సిన్‌ తీసుకోకపోవడమే మంచిదని సూచించారు నార్వే అధికారులు. అతి త‌క్కువ జీవిత‌కాలం ఉన్న‌వారు టీకా తీసుకోవడం వల్ల పెద్ద‌గా ప్రయోజనం ఉండ‌ద‌ని, వారికి టీకా అన‌వ‌స‌రం అన్న అభిప్రాయాన్ని నార్వే ఆరోగ్య శాఖ వ్య‌క్తం చేసిం‌ది. 

ఆరోగ్య‌వంతులు, యువ‌కులు టీకాను తీసుకోవ‌చ్చు అని నార్వే ప్ర‌భుత్వం తెలిపింది. ఇక తమ వ్యాక్సిన్‌ తీసుకుని 23 మంది మరణించిన ఘటనపై ఫైజ‌ర్ కంపెనీ విచార‌ణ చేప‌డుతున్న‌ది. టీకా వ‌ల్ల స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారి సంఖ్య త‌క్కువ‌గానే ఉంద‌ని, తాము ముదుగా అనుకున్న రీతిలో సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న‌ట్లు ఫైజ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. 

ఇక ఇప్పటి వరకు నార్వేలో వైర‌స్ వ‌ల్ల రిస్క్ ఉన్న సుమారు 33 వేల మందికి టీకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్ర‌భావం ఉండ‌గా.. దాంట్లో మూడో వంతు మంది 80 ఏళ్లు దాటిన‌వారే ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios