కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రోజు రోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ఈ వైరస్ ఎటు నుంచి ఎవరికి సోకుతుందో అసలు అర్థం కావడం లేదు. 

తాజాగా ప్రపంచవ్యాప్తంగా మంగ‌ళ‌వారం కొత్తగా 2,05,564 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఫ‌లితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,39,595కి చేరింది. అలాగే నిన్న 5448 మంది చ‌నిపోవడంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5,45,588కి పెరిగింది. ఇక ప్ర‌స్తుతం రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 68,42,510గా ఉండ‌గా, యాక్టీవ్ కేసుల సంఖ్య 45,51,497గా ఉంది.

అమెరికా విష‌యానికొస్తే.. మంగ‌ళ‌వారం 54224 మందికి క‌రోనా రావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 30,95,866కి చేరింది. అలాగే నిన్న 958 మంది చ‌నిపోవ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 133937కి పెరిగింది.

ఇక భారత్  దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22,252 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,665కి చేరింది. ఇందులో 2,59,557 యాక్టివ్ కేసులు ఉండగా.. 4,39,948 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న ఒక్క రోజే వైరస్ బారిన పడి 467 మంది మృతి చెందటంతో మొత్తం ఇప్పటివరకు కరోనా వల్ల 20,160 మంది మరణించారు.