పిల్లలు ఈ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా ఉండేందుకు వారికి కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇప్పించాలని వారు సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయడం మొదలుపెట్టింది. తగ్గిపోయింది లే అని అందరూ ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టగానే తిరగపెట్టింది. ఇక చిన్నారుల్లో సైతం కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. చిన్నారుల్లో కొత్త రకంగా కరోనా ఎటాక్ చేసే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లలు ఈ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా ఉండేందుకు వారికి కూడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇప్పించాలని వారు సూచిస్తున్నారు.

ప్రస్తుతం అన్ని దేశాల్లో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నదని, పిల్లల్లో కూడా ప్రధానంగా రెండు కారణాలతో టీకాలు వేయడం అవసరమని అమెరికాలోని బ్రిఘం, ఉమెన్స్ హాస్పిటల్‌లోని అత్యవసర ఔషధ విభాగం వైద్యుడు జెరెమీ శామ్యూల్ ఫౌస్ట్, జార్జ్‌టౌన్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లోని సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ సైన్స్‌ విభాగం వైరాలజిస్ట్ డాక్టర్ ఏంజెలా రాస్‌ముస్సేన్‌లు పేర్కొంటున్నారు.

కరోనాపై తుది యుద్ధంలో విజయం సాధించడానికి పిల్లలకు టీకాలు వేయడం చాలా అవసరమని వారు అంటున్నారు. అలా చేయనిపక్షంలో వైరస్‌ వేరియంట్ త్వరలో మరింత తీవ్రంగా వ్యాప్తిచెంది పిల్లలను తీవ్రంగా అనారోగ్యానికి గురిచేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలో దాదాపు 3 మిలియన్ల మందికి, అమెరికాలో 2 మిలియన్ల మందికి ప్రతినిత్యం కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. రెండు దేశాలు తమ వయోజనులకు వీలైనంత త్వరగా టీకాలు వేయాలని భావిస్తున్నాయి.

పిల్లల్లో కరోనా దీర్ఘకాలిక ప్రభావాలు అన్ని కేసులు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారని, ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ కరోనా ఇతర చెడు ప్రభావాలకు సంబంధించిన పరిస్థితి ఇంకా స్పష్టంగా తెలియలేదని వారు చెప్తున్నారు. వారిలో లక్షణాలు బయటపడకపోవడం వల్ల కరోనా గురించి తల్లిదండ్రులకు తెలియదని రెండవ కారణంగా చెప్తున్నారు.