అమెరికాలో లక్ష దాటిన కరోనా మరణాలు

అమెరికాలో తాజాగా 7,624 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 17, 13,850కి చేరింది. మరోవైపు అక్కడ ఇప్పటివరకూ 1,00,090 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా మరణాలపై జాన్ హాప్‌కిన్స్ యూనివిర్సిటీ సమాచారం అందిస్తోంది.

coronavirus has killed more than 100,000 people in the United States on Wednesday

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా భారత్ లో లక్షన్నర కేసులు నమోదైతే.. అగ్రరాజ్యం అమెరికాలో లక్ష మరణాలే సంభవించడం గమనార్హం. ఈ వైరస్ పుట్టుకకు  చైనా కారణమైనా.. ఎక్కువగా దెబ్బతిన్నది మాత్రం అమెరికా అనే చెప్పొచ్చు.

అమెరికాలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. అత్యధిక మరణాలు నమోదు చేసిన దేశంతో పాటు లక్ష కరోనా మరణాలు నమోదు చేసిన ఏకైక దేశం అమెరికా కావడం గమనార్హం. 

అమెరికాలో తాజాగా 7,624 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 17, 13,850కి చేరింది. మరోవైపు అక్కడ ఇప్పటివరకూ 1,00,090 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా మరణాలపై జాన్ హాప్‌కిన్స్ యూనివిర్సిటీ సమాచారం అందిస్తోంది.

కాగా, ప్రపంచ దేశాల ఈ దుస్థితికి ప్రధాన కారణం చైనాయేనని అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. చైనానే కరోనా వైరస్‌ను క్రియేట్ చేసి ప్రపంచ దేశాల మీదకి వదిలిందన్న కోణంలో అమెరికా అధికారులు దర్యాప్తు సైతం ప్రారంభించారు. 

ఇదిలా ఉండగా.. భారత్ లో ఇప్పటి వరకు లక్షా 58వేల మందికి పైగా కరోనా సోకింది. కాగా.. 4వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లోనూ ప్రతి రోజూ 5వేలకు పైగానే కేసులు నమోదౌతున్నాయి. వచ్చేది వర్షా కాలం కావడంతో భారత్ లో మరింతగా ఈ వైరస్ వృద్ధి చెందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. భారత్ లో రికవరీ రేటు 42శాతానికి పైగా ఉండటం ఉపశమనం కలిగిస్తోంది.  ఇప్పటికే భారత్ కూడా కరోనా సోకిన దేశాల జాబితాలో పదో స్థానానికి చేరుకుంది. అమెరికా కేసుల్లోనూ, మరణాల్లోనూ తొలి స్థానంలో ఉండటం గమనార్హం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios