కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలోనూ ఈ వైరస్ రెండు వేల మందికిపైగా పాకేసింది. అయితే... ఇప్పుడు ఈ వైరస్ కారణంగా ఓ కంపెనీ ఏకంగా బీర్ తయారీనే ఆపేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...కరోనా బీర్ పేరు వినే ఉంటారు. ఈ బీర్ కంపెనీ కరోనా వైరస్ కారణంగా నష్టాలను చవిచూస్తోంది. దానికి కారణమేంటో తెలుసా... ఆ బీర్ పేరు కరోనా అని పెట్టడమే. ఈ బీరు ఖరీదు కూడా కాస్త ఎక్కువే. అన్ని బ్రాండ్లతో పోలిస్తే దీని క్వాంటిటీ కూడా తక్కువగానే ఉంటుంది.

Also Read కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంతో వైద్యం: వందేళ్ల నాటి విధానంతో అమెరికాలో ప్రయోగం...

అయితే కరోనా వైరస్ దెబ్బకు కరోనా బ్రాండ్ బీర్ తాగడం మానేశారు జనం. కరోనా పేరు చూసి... ఇది తాగితే కరోనా వైరస్ వస్తుందనే అనుమానంతో వీళ్లు ఇలా చేస్తుండటం విశేషం.  ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్ వస్తుండటం విశేషం. కాగా... తాజాగా కరోనా బీర్ ని నిలిపివేస్తున్నామని ప్రకటన చేశారు.

మహమ్మారి విజృంభిస్తున్న వేళ మెక్సికో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు... ‘‘ బీర్‌ ప్లాంట్లలో ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గించబోతున్నాం’’అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ప్రభుత్వం గనుక సహకరిస్తే తమ సంస్థలోని 75 శాతం మంది సిబ్బంది బీర్‌ తయారీలో నిమగ్నమయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. కాగా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కారణంగా అమెరికాలో కరోనా బీర్‌ అమ్మకాలు 40 శాతం మేర అమ్మకాలు పడిపోయాంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే గ్రూప్‌ మాడెలో ఈ వార్తలను ఖండించింది. (చైనాకు పేరుప్రఖ్యాతులే ముఖ్యం: నిక్కీ హేలీ)

అంతేగాకుండా కరోనా వ్యాప్తిలోనూ జోరుగా అమ్మకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాలతో  గ్రూప్‌ మాడెలోతో పాటు మెక్సికోలోని బీర్‌ మరో ప్రధాన ఉత్పత్తిదారు హెంకెన్‌ సైతం నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బీరు ప్రియులు నిరాశకు గురవుతున్నారు.