తాజాగా 1982 సమయంలో ఈ కేసుకు సంబంధించిన విచారణలో తీవ్రమైన లోపాలు చోటు చేసుకున్నాయని ఆంథోని  బ్రాడ్ వాటర్ ను కోర్టు Innocentగా తేల్చింది. ఒనోండగా  కౌంటీ  జిల్లా అటార్నీ విలియం  ఫిట్జ్‌ ప్యాట్రిక్,  సుప్రీంకోర్టు న్యాయమూర్తి  గోర్డాన్ కఫీ  ఈ కేసుపై విచారణ చేపట్టి.. నేరారోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న  బ్రాడ్ వాటర్ కు అప్పటి కోర్టు ప్రాసిక్యూషన్ లో Injustice జరిగిందని తెలిపారు.

న్యూయార్క్ : అత్యాచారం కేసులో చేయని నేరానికి నేరస్తుడిగా 16యేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ వ్యక్తికి ఉపశమనం లభించింది. 1982లో ప్రముఖ రచయిత అలిస్ సెబోల్డ్ పై molestation జరిగింది. అయితే ఆమె ఆమె సిరక్యూస్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు Anthony Broadwater అనే వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ‘లక్కీ’ అనే పుస్తకంలో రాసింది.

అయితే తాజాగా 1982 సమయంలో ఈ కేసుకు సంబంధించిన విచారణలో తీవ్రమైన లోపాలు చోటు చేసుకున్నాయని ఆంథోని బ్రాడ్ వాటర్ ను కోర్టు 
Innocentగా తేల్చింది. ఒనోండగా కౌంటీ జిల్లా అటార్నీ విలియం ఫిట్జ్‌ ప్యాట్రిక్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గోర్డాన్ కఫీ ఈ కేసుపై విచారణ చేపట్టి.. నేరారోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న బ్రాడ్ వాటర్ కు అప్పటి కోర్టు ప్రాసిక్యూషన్ లో 
Injustice జరిగిందని తెలిపారు.

ఈ సమయంలో 61వేల ఆంథోని బ్రాడ్ వాటర్ కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తరువాత బ్రాడ్ వాటర్ మీడియాతో మాట్లాడుతూ తాను గత రెండు రోజులుగా ఆనందంగా ఉపశమనంతో ఉన్నానని తెలిపారు. ఈ కేసును తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. 1981లో తనపై అత్యాచారం జరిగిందని, కొన్ని నెలలకు అత్యాచారం జరిగిన వీధిలో ఓ నల్లజాతి వ్యక్తి కనిపించడంతో... అతనే తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపిస్తూ Alice Sebold తన పుస్తకం 
'Lucky'లో రాసింది. తరువాత బ్రాడ్ వాటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 16 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆంథోని బ్రాడ్ వాటర్ పై నేరారోపణలు రుజువు కాలేదు. ఆయనపై ఉన్న అత్యాచారం కేసును కోర్టు కొట్టివేసింది.

తొమ్మిదేళ్ల బాలికపై 1959లో హత్యాచారం.. 62యేళ్ల తరువాత డీఎన్ఏ టెస్టుతో తీర్పు.. కాకపోతే..

ఇదిలా ఉండగా, అగ్రరాజ్యం అమెరికాలో 62యేళ్ల తర్వాత ఓ వ్యక్తిని అత్యాచారం కేసులో నేరస్తుడిగా నిర్ధారించింది కోర్టు. డీఎన్ఏ టెస్ట్ ఆధారంగా అతడిని దోషిగా తేల్చింది ఆ వివరాలు…62 ఏళ్ల క్రితం 1959లో ఈ దారుణం చోటుచేసుకుంది. స్పోకనే వెస్ట్ సెంట్రల్ పరిసర ప్రాంతానికి చెందిన 9 ఏళ్ల బాలిక క్యాంప్ ఫైర్ మింట్స్ అమ్మడానికి బయటకు వెళ్లింది. 

ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. minor girl గురించి గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. రెండు వారాల తర్వాత చిన్నారి dead body లభ్యమైంది. బాలికపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పేరు John Reig Hoff.. అప్పటికి అతడి పై పోలీసులకు ఎలాంటి అనుమానం కలగలేదు.

ఈ క్రమంలోనే అప్పటికే 9 ఏళ్ల చిన్నారి ఉసురు తీసిన జాన్‌ రీగ్‌.. మరో దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ కాళ్లు, చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు జాన్‌ రీగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడి వయసు 20 సంవత్సరాలు. మహిళను హత్య చేసిన కేసులో అమెరికా కోర్టు జాన్‌ రీగ్‌కి శిక్ష విధించింది. మహిళ హత్య కేసు విచారణ సమయంలో బాలిక అత్యాచారానికి గురైన సమయంలో జాన్‌ రీగ్‌ ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు గమనించారు. అలా కేసులో నిందితులు వెలుగులోకి వచ్చారు.