వాషింగ్టన్:అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ పేరును యూఎస్ కాంగ్రెస్ ప్రకటించింది. బైడెన్ గెలుపును అధికారికంగా యూఎస్ కాంగ్రెస్ ధృవీకరించింది.

యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం గురువారం నాడు తదుపరి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ను, ఉపాధ్యక్షురాలిగా కమలా హారీస్  విజయాన్ని అధికారికంగా ధృవీకరించింది. కేపిటల్ ఘటన చోటు చేసుకొన్న కొన్ని గంటల తర్వాత యూఎస్ కాంగ్రెస్ బైడెన్, హరీస్ ల విజయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

కేపిటల్ వైపు వెళ్లమని ప్రోత్సహించిన ట్రంప్.. హింసాత్మక ఘర్ణ తర్వాత తన మద్దతుదారులను ఇంటికి వెళ్లాలని కోరారు. ఇది మోసపూరిత ఎన్నిక అని ఆరోపించారు. మనకు శాంతి కావాలి.. వెంటనే ఇళ్లకు వెళ్లాలని ఆయన మద్దతుదారులను కోరారు. 

గత ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ట్రంప్ ఆరోపించారు.ఈ విషయమై కోర్టుల్లో కేసులు కూడ వేశారు. చాలా కోర్టులు ఈ కేసులను కొట్టివేశాయి.