Asianet News TeluguAsianet News Telugu

హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన చైనా రాకెట్: ఊపిరి పీల్చుకొన్న శాస్త్రవేత్తలు

చైనా రాకెట్ భూమిపై ఆదివారం నాడు కుప్పకూలింది.  ఆదివారం నాడు భూ వాతావరణంలోకి రాకెట్ ప్రవేశించింది. ఇవాళ ఉదయం హిందూ మహాసముద్రంలో ఈ రాకెట్ కుప్పకూలింది. 12  టన్నుల బరువున్న రాకెట్ హిందూ మహాసముద్రంలో కుప్పకూలడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు. 

Chinese Rocket Segment Re-Enters Earth, Disintegrates Over Indian Ocean lns
Author
New Delhi, First Published May 9, 2021, 9:35 AM IST


వాషింగ్టన్: చైనా రాకెట్ భూమిపై ఆదివారం నాడు కుప్పకూలింది.  ఆదివారం నాడు భూ వాతావరణంలోకి రాకెట్ ప్రవేశించింది. ఇవాళ ఉదయం హిందూ మహాసముద్రంలో ఈ రాకెట్ కుప్పకూలింది. 12  టన్నుల బరువున్న రాకెట్ హిందూ మహాసముద్రంలో కుప్పకూలడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు. 

చైనా యొక్క కొత్త అంతరిక్ష కేంద్రానికి చెందిన  మొదటి మాడ్యూల్ ను ఏప్రిల్ 29న భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది లాంగ్ మార్చ్ -5 బి రాకెట్.  ఇవాళ ఉదయం రాకెట్ శిథిలాలు హిందూ మహాసముద్రంలో పడ్డాయని చైనా తెలిపింది.భూ వాతావరణంలోకి  ప్రవేశించే సమయానికే రాకెట్ శిథిలమైందని నిపుణులు చెప్పారు. యూఎస్ మిలిటరీ డేటా ప్రకారంగా స్పేస్ ట్రాక్ భూ వాతావరణంలోకి ప్రవేశించిందని ధృవీకరించింది.  

లాంగ్ మార్చ్ 5 బి రీ ఎంట్రీని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోవచ్చు.. రాకెట్ డౌన్ అయిందని యూఎస్ తెలిపింది. చైనా శాస్త్రవేత్తల నియంత్రణ కోల్పోయిన రాకెట్ తిరిగి భూ మార్గంలోకి ప్రవేశించింది. అయితే  ఎక్కడ ఈ రాకెట్ కుప్పకూలుతోందోననే  ఆందోళన నెలకొంది. భారత్  లేదా తుర్క్ మెనిస్తాన్ లో కూలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇవాళ ఉదయం హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది.  ఈ రాకెట్ కుప్పకూలిన భూమికి హానికలగడం చాలా తక్కువేనని చైనా ప్రకటించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios