న్యూఢిల్లీ: దిగుమతి చేసుకొన్న ఆహార పదార్ధాల్లో కరోనా వైరస్ ఉందనే కారణంగా  చేపల దిగుమతిని ఇండియా నుండి చైనా తాత్కాలికంగా నిలిపివేసింది.

దిగుమతి చేసుకొన్న చేపల్లో కరోనా వైరస్ ఉందని చైనా ప్రకటించింది. ఇండియాలోని బసు ఇంటర్నేషనల్ కంపెనీ నుండి వారం రోజుల పాటు చేపల దిగుమతిని నిషేధిస్తున్నట్టుగా చైనా కస్టమ్స్ కార్యాలయం శుక్రవారం నాడు ప్రకటించింది.

దిగుమతి చేసుకొన్న చేపలకు చెందిన మూడు ప్యాకేజీల్లో మూడు కరోనా వైరస్ నమూనాలను  గుర్తించినట్టుగా చైనా తెలిపింది.వారం రోజుల తర్వాత దిగుమతులపై తిరిగి చేపలను దిగుమతి చేసుకొంటామని జనరల్ ఆడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రకటించింది.

ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకొన్న చేపల నుండి కరోనా వైరస్ మూలాలను గుర్తించినట్టుగా  చైనా ఇటీవలనే ప్రకటించింది. దీంతో ఇండోనేషియా నుండి చేపల దిగుమతిని కూడ చైనా నిషేధించింది.

బ్రెజిల్, రష్యా, ఈక్వెడార్ ల నుండి చైనాకు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ లలో కూడ వైరస్ జాడ ఉన్నట్టుగా చైనా గుర్తించింది.