బీజింగ్: చైనాలో మరోసారి కరోనా మరణాలు పెరిగిపోతున్నాయి. 8 మాసాల తర్వాత తొలిసారిగా చైనాలో కరోనాతో ఒకరు మరణించినట్టుగా ఆ దేశం ప్రకటించింది. కరోనా కేసులు పెరిగి పోవడంతో చైనాలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ లు, ఎమర్జెన్సీలను ఆ దేశం విధించింది.

చైనా ఉత్తరభాగంలోని 20 మిలియన్ ప్రజలు లాక్‌డౌన్ లో ఉన్నారు. ఒక ఫ్రావిన్స్ లో అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రతి రోజూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు, సామూహిక పరీక్షల ద్వారా కరోనా వైరస్ ను నియంత్రించగలిగింది. అయితే ఇటీవల కాలంలో 138 ఇన్‌ఫెక్షన్లను నేషనల్ హెల్త్ కమిషన్ గురువారం నాడు నివేదించింది. 2020 మార్చి తర్వాత ఇదే అత్యధికం.

చైనాలోని హెబి ఫ్రావిన్సులో కోవిడ్ మరణం చోటు చేసుకొందని ఆ దేశం ప్రకటించింది. ఇదే రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారని ఆ దేశం తెలిపింది.హెబీ ప్రావిన్సుతో పాటు షిజియాజువాంగ్ ఫ్రావిన్సుల్లో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. అధిక జనాభా ఉన్న జింగ్ టాయ్, లాంగ్ ఫాంగ్ నగరాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. 

కరోనాతో చైనాలో ఇప్పటికే 4635 మంది మరణించారు. 2020 మే నెల నుండి ఇప్పటివరకు ఒక్క కరోనా మరణం కూడ చోటు చేసుకోలేదు.కరోనా వైరస్ మూలాలను అన్వేషించేందుకు గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి బృందం చైనాకు చేరుకొంది. వుహాన్ లో కరోనా వైరస్ బయటపడింది. ఈ వైరస్ మూలాలను తెలుసుకొనేందుకు గాను డబ్ల్యు హెచ్ ఓ బృందం చైనాకు చేరుకొంది.