చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను హౌజ్ అరెస్టు చేశారని, పీఎల్ఏ హెడ్‌గా తొలగించారని, చైనా అధ్యక్షుడిగానే తొలగించి కొత్త అధ్యక్షుడిగా లి ఖియామింగ్‌ను ఎంపిక చేశారని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. వీటిపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి ట్వీట్ చేశారు. 

న్యూఢిల్లీ: భారత్‌లో సరిహద్దులో ఇంకా ఘర్షణా ధోరణినే అవలంభిస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధం చేశారా? చైనా ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించారా? సోషల్ మీడియాలో చాలా పోస్టు ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి. అయితే, ఈ వార్తలపై అధికారిక ధ్రువీకరణ ఏమీ లేదు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ లేదా ఇతర జాతీయ మీడియా సంస్థలూ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ, ఈ రూమర్స్ పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యన్ స్వామి చేసిన ట్వీట్ చర్చను మరింత పెంచింది.

సోషల్ మీడియాలో మరో వదంతు ఒకటి ప్రచారం అవుతున్నదని ఆయన ట్వీట్ చేశారు. ‘జీ జిన్‌పింగ్ చైనాలో గృహ నిర్బంధంలో ఉన్నారా? జీ జిన్‌పింగ్ ఇటీవలే సమర్ఖండ్‌కు వెళ్లినప్పుడు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు ఆయనను ఆర్మీకి పార్టీ ఇంచార్జీగా తొలగించారు. ఆ తర్వాత ఆయనను హౌజ్ అరెస్టు చేశారు. ఇలా ఆ వదంతి సాగుతుతున్నది’ అని ఆయన పేర్కొన్నారు. 

పలువురు చైనా జాతీయులు కూడా ఇలాంటి పోస్టులు చేశారు. జీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధం చేశారని తెలిపారు. చాలా మంది ఆర్మీ బాధ్యతలను పీఎల్ఏ తీసుకున్నదని కొందరు ట్వీట్ చేశారు. అంతేకాదు, కొందరైతే ఏకంగా లి ఖియామింగ్‌ను చైనా అధ్యక్షుడిని చేశారని పోస్టలు పెట్టారు. 

Scroll to load tweet…

జెన్నిఫర్ జెంగ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఇలా పేర్కొంది. సెప్టెంబర్ 22న పీఎల్ఏ మిలిటరీ వాహనాలు బీజింగ్ వైపుగా ప్రయాణం మొదలు పెట్టాయి. హువాన్‌లై కౌంటీ నుంచి హెబెయి ప్రావిన్స్‌లోని ఝాంగ్‌జియాకౌ సిటీ వరకు అంటే 80 కిలోమీటర్ల మేర వీటి మార్చ్ సాగింది. అదే సమయంలో సీసీపీ సీనియర్ నేతలు ఆయనను పీఎల్ఏ హెడ్‌గా తొలగించారని, ఆ తర్వాత హౌజ్ అరెస్టు చేశారనే రూమర్లు వస్తున్నాయి.. అని ఆమె ట్వీట్ చేశారు. ఓ వీడియోను కూడా జత చేశారు.

చైనాలో అవినీతిపై తీవ్ర పోరాటం మొదలు పెట్టిన అక్కడి ప్రభుత్వం ఇద్దరు మాజీ మంత్రులకు మరణ శిక్ష విధించింది. మరో నలుగురు అధికారులకు యావజ్జీవ కారాగారవాసం శిక్ష విధించింది. ఈ ఆరుగురు ప్రత్యేక రాజకీయ వర్గంగా భావిస్తున్నారు. ఈ ఆరుగురూ జిన్‌పింగ్‌కు వ్యతిరేకులని తెలుస్తున్నది. జిన్‌పింగ్ వ్యతిరేక లాబీనే అధ్యక్షుడి హౌజ్ అరెస్టు అనే వదంతులను వ్యాపిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే, ఈ క్యాంపెయిన్ పై సోషల్ మీడియాలో విరివిగా చర్చ జరుగుతున్నది.