Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్ ల్యాబ్‌లో సృష్టించలేదు: విమర్శలపై స్పందించిన చైనా

ఈ వైరస్ చైనాలో ప్రమాదవశాత్తూ పుట్టింది కాదని, ఆ దేశం కావాలనే కరోనాను సృష్టించిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అయితే చైనా మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతూనే ఉంది.
China Govt says WHO has said no evidence coronavirus was made in a lab
Author
Wuhan, First Published Apr 16, 2020, 8:55 PM IST
చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం మూడోంతుల భూగోళాన్ని చుట్టుముట్టింది. దీని కారణంగా ఇప్పటి వరకు లక్షమందికిపైగా మరణించడంతో లక్షలాది మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

అయితే ఈ వైరస్ చైనాలో ప్రమాదవశాత్తూ పుట్టింది కాదని, ఆ దేశం కావాలనే కరోనాను సృష్టించిందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. అయితే చైనా మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతూనే ఉంది.

జాగా మరోసారి ఈ వార్తలపై స్పందించింది చైనా. కోవిడ్ 19 వైరస్‌ను ల్యాబ్‌లో సృష్టించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గతంలోనే స్పష్టం చేసిందని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

తమ దేశంలోని ఓ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారనే ఆరోపణలను ఆయన ఖండించారు. మరోవైపు తమ ప్రభుత్వం కరోనా వైరస్‌ ల్యాబ్ నుంచి వ్యాప్తి చెందిందా అనే విషయాన్ని తేల్చే పనిలో ఉందని చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

వ్యవహారంలో చైనా నిజానిజాలు వెల్లడించాలని స్టేట్ సెక్రటరీ మైక్ పాంపియో డిమాండ్ చేశారు. కాగా ఈ కరోనా వైరస్ చైనాలోని ఒక ల్యాబ్ నుంచి లీక్ అయ్యి ఉండొచ్చని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించిన  సంగతి తెలిసిందే. 
Follow Us:
Download App:
  • android
  • ios