భారత్ లో 59 చైనా యాప్స్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 సంస్థలకు చెందిన యాప్‌లపై నిషేధం విధించింది. 

వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సహా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో టిక్‌టాక్‌‌తో పాటు షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీ చాట్‌, బ్యూటీ ప్లస్‌ తదితర కీలక యాప్‌లు ఉన్నాయి.

చైనీస్‌ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే కొంతకాలంగా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధం విధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌ వినిపిస్తోంది. గల్వాన్ లోయలో ఘర్షణలకు కారణమై 20 మంది జవాన్లు అమరులవడానికి కారణమైన చానా వస్తువున్నింటినీ బహిష్కరించాలని దేశవాసులు డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం కూడా వీటిని బ్యాన్ చేసింది.

అయితే.. భారత్ లో ప్రజలకు బాగా అలవాటు అయిపోయిన ఈ యాప్స్ ఒక్కసారిగా బ్యాన్ అయిపోవడంతో చైనా కంపెనీలు విలవిలలాడుతున్నాయి. నిషేధం ఎత్తివేయించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా... తమ యాప్స్ పై భారత్ నిషేధం విధించిచడంతో.. చైనా సంచలన నిర్ణయం తీసుకుంది.

వియాన్ వెబ్ సైట్ www.wionews.com  పై నిషేధం విధిస్తూ.. చైనా నిర్ణయం తీసుకుంది. చైనా ఇంటర్నెట్ పర్యవేక్షణ వాచ్‌డాగ్ అయిన గ్రేట్‌ఫైర్.ఆర్గ్.. చైనాలో WION పూర్తిగా నిషేధించింది. ఇది భారత్ కి చెందిన సంస్థ కావడం గమనార్హం.


కరోనావైరస్ మహమ్మారి చైనా నుంచే ఇతర దేశాలకు ప్రబలిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని  WIONచాలా సార్లు ప్రచురించింది. కరోనా విషయంలో చైనా కి వ్యతిరేకంగా వార్తలు రావడంపై ఆదేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 

మార్చిలో, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి - జావో లిజియన్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో WION బ్లాక్ చేశారు.  భారతదేశంలో చైనా దౌత్యవేత్తలు కూడా మహమ్మారి గురించి WION యొక్క కవరేజీని విమర్శించారు. తాజాగా చైనా యాప్స్ ని ఇక్కడ నిషేధించడంతో.. WION ని నిషేధించారు.