ఈ వారాంతంలో నగరంలో వేర్వేరు ఘటనల్లో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారని, ఒక యువకుడితో సహా మరో 16 మంది గాయపడ్డారని చికాగో పోలీసులు తెలిపారు. 

చికాగో : ఈ క్రమంలో శుక్రవారం మొదటి ఘటన చోటుచేసుకుంది. సౌత్ కిల్‌పాట్రిక్‌లోని 300 బ్లాక్‌లో సుమారు సాయంత్రం 5:45కి మొదటిగా కాల్పులు సంభవించాయి. 

తన ఇంట్లో ఉన్న ఓ 69 ఏళ్ల వ్యక్తిమీద.. మరో వ్యక్తి గన్ తో ఛాతిమీద బుల్లెట్ల వర్షం కురిపించి చంపాడని అధికారులు చెబుతున్నారు. ఇది గమనించిన వారు వెంటనే బాధితుడిని ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

దక్షిణ ఇండియానాలోని 3400 బ్లాక్‌లో రాత్రి సుమారు 10:17 ని.లకు కాల్పులు జరిగాయన్న సమాచారంతో చికాగో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని చూడగా 40 ఏళ్ల వ్యక్తి నేలపై పడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఛాతీ మీద, కుడి వైపు, కుడిచేతి మీద అనేక తుపాకీ గాయాలు ఉన్నాయి. అతను స్పాట్ డెడ్ అని ప్రకటించారు.

ఇక శనివారం తెల్లవారుజామున సుమారు 1:05 గంటలకు, నార్త్ స్టేట్ స్ట్రీట్ 300 బ్లాక్‌లో ఇద్దరు మహిళలు ఒక వ్యక్తితోవాగ్వాదానికి దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి జేబులో నుంచి గన్ తీసి వారిమీద కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 26 ఏళ్ల మహిళ ఛాతీమీద బుల్లెట్ గాయాలతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించిందని పోలీసులు తెలిపారు. ఇక 31 ఏళ్ల మరో మహిళ, ఎడమ తొడకు దెబ్బ తగిలి, ఏరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గానే ఉంది. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వెస్ట్ సన్నీసైడ్ అవెన్యూలోని 3400 బ్లాక్‌లో సుమారు ఉదయం 6:05 గంటలకు, కాల్పులు జరిపారన్న సమాచారం మేరకు స్పందించిన అధికారులు.. అక్కడికి చేరుకోగా... తుపాకీ గాయాలతో నేలపై పడి ఉన్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. 30 ఏళ్ల వ్యక్తి తలపై, 56 ఏళ్ల వ్యక్తి కాలిపై కాల్పులు జరపగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

శనివారం జరిగిన మరో కాల్పుల ఘటనలో, ఈస్ట్ 95వ స్ట్రీట్‌లోని 1500 బ్లాక్‌లో సుమారు 3:45 గంటలకు దోపిడీకి యత్నించిన ఓ వ్యక్తిని కాల్చి చంపారు. ఇద్దరు వ్యక్తులు షాప్ నుండి తమ వాహనం వద్దకు తిరిగి వెళుతుండగా, 32 ఏళ్ల వ్యక్తి వారి వద్దకు వచ్చి వారితో మాట్లాడటం ప్రారంభించాడని అధికారులు చెబుతున్నారు. వారిద్దరూ కార్లో ఎక్కగానే... అతను వారి కారు వెనకసీట్లో ఎక్కి.. వారికి గన్ ఎక్కుపెట్టాడు. దీంతో వెంటనే అప్రమత్తమన ఆ ఇద్దర్లోని ఓ వ్యక్తి నిందితుడి ఎడమ కణతమీద కాల్పులు జరిపాడు. 

కాగా, అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత మరో ఘోరమైన కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సుమారు సాయంత్రం 4:08 గంటలకు, 27 ఏళ్ల వ్యక్తి పార్కింగ్ స్థలంలో ఉండగా, ఓ వాహనం అతని ముందు వచ్చి ఆగింది. అందులోని వ్యక్తి నిలబడ్డ వ్యక్తిపై కాల్పులు జరిపాడు.

బాధితుడి మీద కాల్పులు జరిపిన అనంతరం రెస్టారెంట్‌ లోపలికి పారిపోయాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత సుమారు 10:45 గంటలకు, మరొక వ్యక్తి కాల్చి చంపబడ్డాడు.

28 ఏళ్ల మహిళ ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగిందని, ఆ తర్వాత తుపాకీ తీసి మహిళ ఛాతీపై కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారు. ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇక ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు గోల్డ్ కోస్ట్‌లోని ఈస్ట్ వాల్టన్ 200 బ్లాక్‌లో ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

వీకెండ్‌లో ఇప్పటివరకు జరిగిన మిగిలిన కాల్పుల వివరాలు... 
శుక్రవారం -
సౌత్ ఆర్చర్ 3900 బ్లాక్‌లో సాయంత్రం 6:45 గంటలకు గ్యాస్ స్టేషన్‌లోకి వెళ్లిన 21 ఏళ్ల వ్యక్తి కడుపులో కాల్పులు జరిపారు. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఆ తరువాత సుమారు 8:40 గంటల సమయంలో సౌత్ యేల్‌లో 41 ఏళ్ల వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గ్రే సెడాన్‌లో ఉన్న వ్యక్తి కాల్పులు జరిపాడు, అతని ఛాతీపై, చేతిపై కాల్పులు జరిపాడు. తలకు గాయంతో ఉన్న వ్యక్తిని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటివే మరో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. 

శనివారం -
సౌత్ హెర్మిటేజ్‌లో 43 ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ వెడుతుండగా ముగ్గురు వ్యక్తులు అతనిని అనుసరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ తరువాత వారు బాధితుడి మీద కాల్పులు జరిపారు. వెంటనే నిందితులు పారిపోయారు. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

ఆ తరువాత 3:52 గంటలకు, డ్రైవింగ్ చేస్తున్న 41 ఏళ్ల వ్యక్తి ఎడమ భుజంపై కాల్చారు. 

సౌత్ కోస్ట్‌నర్‌లోని 400 బ్లాక్‌లో ఉదయం 4:37 గంటలకు, 29 ఏళ్ల వ్యక్తి ఎడమ కాలు పైభాగంలో రెండుసార్లు కాల్పులు జరిగాయి. అతడిని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఆదివారం -
ఆదివారం సుమారు 1:03 గంటలకు 35 ఏళ్ల వ్యక్తి తన వాహనంలోకి ఎక్కేందుకు ప్రయత్నించగా, మరో వాహనం అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఒక వ్యక్తి ఆ కారులోంచి దిగి దొంగతనానికి ప్రయత్నించాడు. ఈ ఘర్షణలో కాల్పులు జరిగాయి. 

వెస్ట్ 64వ వీధిలోని 300 బ్లాక్‌లో సుమారు 1:20 గంటలకు, 34 ఏళ్ల వ్యక్తి కాలిబాటపై నడుచుకుంటూ వెళుతుండగా, కుడివైపు తొడపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉంది.

నార్త్ సెంట్రల్ పార్క్‌లో సుమారు 2:20 గంటలకు, ఒక 16 ఏళ్ల బాలుడు వాహనంలో వెళుతుండగా, అతడిమీద బైటినుంచి కాల్పలు జరిగాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వెస్ట్ నార్త్ అవెన్యూలో తెల్లవారుజామున 4:14 గంటలకు 21 ఏళ్ల వ్యక్తి, 22 ఏళ్ల యువకుల మీద కాల్పులు జరిగాయి.