ఓ కార్గో విమానం బొమ్మ విమానంలా రెండు ముక్కలయ్యింది. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
కోస్టారికా : గురువారం Costa Ricaలో ఓ Cargo plane అత్యవసర ల్యాండింగ్ సమయంలో రెండు ముక్కులుగా విరిగిపోయింది. ఈ ప్రమాదం కారణంగా సాన్ జోస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
జర్మన్ లాజిస్టిక్స్ దిగ్గజం DHL కు చెందిన పసుపురంగు విమానం నుండి ముందుగా పొగలు వెలువడ్డాయి. ఆ తరువాత అది ఆగిపోయింది. వెనుక చక్రాల మీదుగా గుండ్రంగా తిరిగుతూ రెండుగా విడిపోయింది. అదే సమయంలో రన్‌వే నుండి పక్కకు జారిపోయింది.
ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బంది బాగానే ఉన్నారని కోస్టా రికా అగ్నిమాపక సిబ్బంది చీఫ్ హెక్టర్ చావెస్ చెప్పారు. అయినా కూడా ముందుజాగ్రత్తగా ఈ గ్వాటెమాలన్ జంటను "వైద్య పరీక్షల కోసం" ఆసుపత్రికి పంపించారని రెడ్‌క్రాస్ ఉద్యోగి గైడో వాస్క్వెజ్ అన్నారు. ఈ ప్రమాదంలో పైలట్ షేక్ అయ్యాడు. కానీ సిబ్బంది ఇద్దరూ స్పృహలోనే ఉన్నారు అని వాస్క్వెజ్ చెప్పుకొచ్చారు.
శాన్ జోస్ వెలుపల ఉన్న జువాన్ శాంటామారియా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన బోయింగ్-757 విమానం, సాంకేతిక లోపం కారణంగా అత్యవసర ల్యాండింగ్ కోసం 25 నిమిషాల తర్వాత తిరిగి రావాల్సి రావడంతో ఉదయం 10:30 గంటలకు (1630 GMT) ఈ ప్రమాదం జరిగింది.
అయితే, విమానంలో హైడ్రాలిక్ సమస్యపై సిబ్బంది స్థానిక అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా సాయంత్రం 6 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేశారు.
