బస్సు లోయలో పడి 22మంది మృతి చెందారు. ఈ దారుణ సంఘటన టునీషియాలో చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోవడంతో 22 మంది ప్రయాణికులు మరణించారు. టునీషియా దేశంలోని ఉత్తర ప్రాంతంలో బస్సు లోయలో పడింది.

ఈ ప్రమాదంలో 22 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బస్సు టునీస్ రాజధాని నగరం నుంచి ఎయిన్ స్నోస్సీ ప్రాంతానికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,