Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం: బస్సుకు మంటలంటుకుని 18 మంది సజీవ దహనం

పాకిస్తాన్ లో వరద బాధితులను తరలిస్తున్న బస్సుకు మంటులు అంటుకుని 18 మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. 

Bus Carrying Flood Affected People Catches Fire in Pakistan, 18 Dead
Author
First Published Oct 13, 2022, 10:08 AM IST


ఇస్లామాబాద్:పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వరద బాధితులనుతరలిస్తున్న బస్సుకు మంటలు అంటుకుని 18మంది మరణించారు.వీరిలో  ఎక్కువగా చిన్నారులు,మహిళలున్నారు. సింధ్ లోని జంషోర్ జిల్లాలోని నూరియాబాద్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరణించినవారిలో ఎనిమిది మందిచిన్నారులున్నారని  నూరియాబాద్ డిప్యూటీ సూపరింటెండ్ వాజిద్ తాహీం డాన్ చెప్పారు.  కరాచీ  నుండి ఖైర్‌పూర్ నాథన్‌షాకు తిరిగి వస్తున్న సమయంలో  ఈ ప్రమాదం చోటు చేసుకుందని డీఎస్పీ వివరించారు.

బస్సులోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ లోపం కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని లియాఖత్ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించారు.ఈ  ప్రమాదంపై  ప్రధాని షెహబాబ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios