గ్రీస్‌లో దారుణం జరిగింది. ఇంగ్లాండ్‌కు చెందిన ఓ యువకుడు మిత్రులతో కలిసి తన పర్యటనను ముగించుకుని తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతుండగా దారుణం జరిగింది. ఆ యువకుడు హెలికాప్టర్ వెనుక వైపు తిరిగే రెక్కలకు తాకాడు. అంతే.. హాస్పిటల్ తీసుకెళ్లనప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
న్యూఢిల్లీ: గ్రీస్‌లో పర్యటిస్తున్న బ్రిటన్ వాసుల విహారంలో విషాదం చోటుచేసుకుంది. బ్రిటన్ నుంచి గ్రీస్‌లో ఎంజాయ్ చేశారు. మైకోనోస్ దీవిలో సరదాగా గడిపి తిరిగి ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరాలనుకున్నారు. అక్కడి నుంచి తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోవాలని భావించారు. కానీ, ఇంతలోనే అనుకోని ఘటన జరిగింది. ఆ పర్యటనలో ఉన్న 21 ఏళ్ల యువకుడు హెలికాప్టర్ రెక్కలు తాకి దారుణంగా మరణించాడు. ఈ ఘటన జులై 25వ తేదీన సాయంతరం 6.20 గంటలకు చోటుచేసుకుంది.
21 ఏళ్ల యువకుడు మరో ముగ్గురు మిత్రులతో కలిసి హెలికాప్టర్‌లో తిరిగారు. ప్రైవేట్ ఎయిర్‌పోర్టులో దిగుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఆ యువకుడు బెల్ 407 హెలికాప్టర్ దిగి దాని వెనుక వైపు వెళ్లాడు. కానీ, ఇంజిన్ ఇంకా ఎంగేజ్ అయి ఉండటం మూలంగా తోక భాగానికి ఉండే రెక్కలు యువకుడిని బలంగా తాకాయి. అంతే, ఆ యువకుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. స్థానిక పోలీసులు వెంటనే స్పాట్ చేరుకుని హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది.
ఆ యువకుడి పేరెంట్స్ కూడా గ్రీస్‌లోని మైకోనోస్ దీవి నుంచి అదే స్పాట్‌కు మరో హెలికాప్టర్‌లో చేరుకుంటుండగా ఆ పైలట్‌కు జరిగిన విషాద ఘటనను వివరించారు. దీంతో వారు నేరుగా ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. తద్వార తల్లిదండ్రులు ఆ దారుణ ఘటనా స్థలిని చూడకుండా చేశారు.
ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది. ఆ హెలికాప్టర్ పైలట్, మరో ఇద్దరు గ్రౌండ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్టు చేశారు. హెలికాప్టర్ పూర్తిగా ఆగక ముందే, వెనుక బ్లేడ్లు ఇంకా తిరుగుతుండగానే ప్యాసింజర్‌ను ఎలా కిందకు దిగనిచ్చారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
