ఎనిమిది మంది శిశువులను హత్య చేసిన నేరంలో లండన్ ఓ నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. మరో పదిమంది శిశువులను హత్య చేయడానికి ప్రయత్నించిన నేరం కూడా ఈమె మీద మోపబడింది. 

వివరాల్లోకి వెడితే లండన్ లోని స్థానిక ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న లూసీ లెట్బీ అనే 30 యేళ్ల నర్సును కోర్టు ఆదేశాల మేరకు లండన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఆమె మీద హత్య, హత్యా ప్రయత్నం అభియోగాలు మోపబడ్డాయి. 

ఈ మేరకు లూసీమీద మోపిన అభియోగాల్లో తదుపరి విచారణలకోసం ఆమెను అదుపులోకి తీసుకోవాల్సిందిగా ప్రాసిక్యూటర్ చెప్పడంతో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

జూన్ 2015 నుంచి జూన్ 2016 మధ్య "కౌంటర్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్ లోని నియోనాటల్ యూనిట్ లో నవజాత శిశువులు, గర్భస్థ శిశు మరణాలు నమోదయ్యాయి" వీటికి కారణం లూసీనే అంటూ ఆరోపణలు ఉన్నాయి.

గురువారం సమీపంలోని వారింగ్టన్‌లో న్యాయాధికారుల ముందు హాజరుపరుస్తారు. ప్రస్తుతం లూసీ పోలీసుల కస్టడీలో ఉంది.