యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ రెండోసారి తిరస్కరించింది. బ్రెగ్జిట్ ప్రక్రియకు రెండు వారాల గడువు మిగిలిన నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటు దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 391 ఓట్లు, అనుకూలంగా 242 ఓట్లు పడ్డాయి.

75 మందికి పైగా అధికార పార్టీ ఎంపీలే ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. ప్రతిపక్ష లేబర్‌‌పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఒప్పందానికి అనుకూలంగా ఓటు  వేయడం మరో విశేషం. ఒకవేళ ఒప్పందం లేకుండా యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగితే బ్రిటన్ తీవ్రంగా నష్టపోతుందని ప్రధాని థెరిస్సా మే వ్యాఖ్యానించారు.