Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి రోజే నిప్పంటించుకున్న వరుడు, వధువు.. ఆ స్టంట్ వీడియో వైరల్

ఆ వరుడు, వధువు తమ పెళ్లిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకోవాలనుకున్నారు. తామే కాదు.. తమ పెళ్లికి హాజరైనవారికీ ఎల్లకాలం గుర్తుండిపోవాలని అనుకున్నారు. ఆ ఇద్దరు కలిసి ఓ స్టంట్ వేశారు. వారు నిప్పు అంటించుకున్నారు. కెమెరాల వైపు పరుగు తీశారు. అగ్ని గుండం నుంచి వారు బయటకు దూసుకువస్తున్నట్టుగా తమ చిత్రాలను ఫొటోషాప్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుని ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేసి సెన్సేషన్‌ క్రియేట్ చేశారు.
 

bride and groom set themselves fire as the made daredevil stunt
Author
New Delhi, First Published May 13, 2022, 4:47 PM IST

న్యూఢిల్లీ: పెళ్లి ఘనంగా చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. దశాబ్దాలపాటు తమ పెళ్లిని అందరూ గుర్తుంచుకోవాలని ఆశపడతారు. అందుకోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు. కానీ, ఇప్పుడు ఆడంబరాలతోపాటు వినూత్న విన్యాసాలు చేయడానికి వరుడు, వధువులు భావిస్తున్నారు. విన్యాసాలతో అందరినీ కట్టిపడేసేలా పెళ్లి చేసుకోవాలని నేటి తరం ఉవ్విళ్లూరుతున్నది. ఇది వరకు ఎక్కడా జరగని, ఎవ్వరూ చేసుకోని రీతిలో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి జంటే గేబ్ జెస్సాప్, అంబిర్ బాంబిర్ మిషెల్లె. గేబ్ జెస్సాప్ ఆల్రెడీ ఒక స్టంట్‌మ్యాన్. తన పెళ్లిలోనూ ఒక అనూహ్య స్టంట్ ఉండాలని ఆయన భావించారు. ఆయన చేసుకోబోయే ఆవిడ మిషెల్లె కూడా ఆయనకు తగినట్టే ఉన్నారు. స్టంట్ చేయడానికి సై అన్నది. ఎందుకంటే.. ఇప్పుడు వరుడు, వధువులు పోటీ పడుతున్నారు. ఆది నుంచే తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే జెస్సాప్, మిషెల్లెలు తమ పెళ్లి రోజును ఎప్పటికి గుర్తుండిపోయేలా ఓ స్టంట్ వేశారు. వారిద్దరూ పెళ్లి ప్రమాణాలు చేసుకున్న తర్వాత ఓ స్టంట్ వేయాలనుకున్నారు. అగ్ని గుండంలో నుంచి ఇరువురూ ఉన్నట్టు, అందులో నుంచి బయటకు దూసుకు వస్తున్నట్టు కొన్ని ఫొటోలు తమ పెళ్లి రోజులో పదిలపరుచుకోవాలని భావించారు. అందుకే వారు స్వయంగా నిప్పు అంటించుకున్నారు. వెనుక వీపు భాగంలో వరుడు, వధువు నిప్పు పెట్టుకున్నారు. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లు వారిని చిత్రిస్తుండగా నిప్పు అంటించుకుని వారి
వైపుగా పరుగు తీశారు. అనంతరం కింద కూర్చోగానే వెంటనే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌తో మంటను ఆర్పేశారు. నిప్పు అంటించుకోగానే పెళ్లికి హాజరైన వారంతా కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కొంత మంది ఈ వీడియో చూసి ఖంగుతిన్నారు. షాక్‌కు లోనై కామెంట్లు చేశారు. కాగా, మరికొందరు అమేజింగ్‌గా ఉన్నది అంటూ ప్రశంసలు కురిపించారు. ఇంకొందరు పలు సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవాలనుకున్నారు. ఈ వీడియోకు వ్యూలతోపాటు కామెంట్లు కూడా పోటెత్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios