ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 53లక్షలు దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 53,04,340కి చేరింది. అలాగే మొత్తం మరణాలు 3,40,004గా నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారి నుంచి కోరుకున్న వారి సంఖ్య 21,58,569గా ఉంది. బ్రెజిల్‌లో ఒక్కరోజులో భారీగా కేసులు నమోదు అయ్యాయి. మృతుల సంఖ్య కూడా బ్రెజిల్‌లో ఎక్కువగానే ఉంది. ఇక రష్యాలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. 

ఈ కరోనా సోకిన వారి సంఖ్యలో  అమెరికా మొదటి స్తానంలో ఉండగా.. బ్రెజిల్ రెండో స్థానానికి చేరుకుంది. అక్కడ గడిచిన 24గంటల్లో వెయ్యికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అక్కడ 3లక్షల మందికి పైగా వైరస్ సోకగా 21వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
 
 చాలా దేశాల్లో కరోనా వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించారు. అయితే.. లాక్ డౌన్ విధించి నెలలు గడుస్తున్నా.. మార్పు ఉండకపోవడంతో విధించిన లాక్ డౌన్ ని సడలిస్తూ వస్తున్నారు. కాగా.. ఈ సడలింపులతో కరోనా కేసులు మరింత ఎక్కువగా పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 53లక్షలు దాటేశాయి. 

ప్రస్తుతం 27,33,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో 45,803 మంది పరిస్థితి సీరియస్‌గా ఉంది. దేశాల వారీగా చూస్తే అమెరికా పరిస్థితి దారుణంగానే ఉంది. అక్కడ నిన్న ఒక్క రోజే 1,461 మంది చనిపోయారు. కొత్తగా 21,408 కేసులు నమోదయ్యాయి. 

అమెరికాలో మొత్తం ఇప్పటి వరకు 94,994 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఆ దేశంలో మొత్తం కేసులు 16 లక్షలకు చేరువలో ఉన్నాయి.

ఇక, మొత్తం కేసుల సంఖ్యలో భారత్ 11వ స్థానంలో, మరణాల సంఖ్యలో 13వ స్థానంలో ఉంది. ఈ మ‌హ‌మ్మారి చైనాలో పుట్టినా అతి తీవ్రంగా ప్ర‌భావితం అయింది మాత్రం అగ్ర‌రాజ్యం అమెరికానే. ఆ దేశంలో ఇప్ప‌టికే 15 ల‌క్ష‌ల 75 వేల పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

 ఆ దేశంలో 93 వేల మంది మ‌ర‌ణించ‌గా.. 3 ల‌క్ష‌ల 61 వేల మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 11 ల‌క్ష‌ల మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

ఇక ర‌ష్యాలో తొలుత వైరస్ వ్యాప్తి త‌క్కువ‌గా క‌నిపించినా.. ఆ త‌ర్వాత తీవ్రంగా వ్యాపించింది. ప్ర‌స్తుతం ర‌ష్యా క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఆ దేశంలో 3 ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా బారిన‌ప‌డ్డారు. అయితే మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండ‌డం ఆ దేశ ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిస్తోంది. 

ర‌ష్యాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2972 మంది మ‌ర‌ణించారు. మరణాల్లో అమెరికా తొలి స్థానంలో ఉండగా, యూకే (35,704), ఇటలీ (32,330) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. నిన్న బ్రెజిల్‌లో 1000మంది కి పైగా మృతి చెందారు. యూకేలో 363, మెక్సికోలో 334, ఇటలీలో 161, రష్యాలో 135, కెనడాలో 119, ఫ్రాన్స్‌లో 110, స్పెయిన్‌లో 110, పెరూలో 110 మంది మరణించారు.