Asianet News TeluguAsianet News Telugu

కరోనాను మించిన మరో ప్రాణాంతక వైరస్.. మెదడులోకి దూరి..

కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతున్న అమెరికాకి తాజాగా మరో ముప్పు వచ్చిపడింది. ఫ్లోరిడాలోని ఓ వ్యక్తికి మెదడును హరించే అరుదైన, ప్రాణాంతక అమీబాతో ఇన్ఫెక్షన్ సోకినట్టు అధికారులు తెలిపారు.

Brain eating amoeba: Warning issued in Florida after rare infection case
Author
Hyderabad, First Published Jul 6, 2020, 1:56 PM IST

ఇప్పటికే కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ వైరస్ ని ఎలా అరికట్టాలో తెలీక సతమతమౌతున్నారు. లక్షల మంది ఈ వైరస్ కి బలై ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికే ఇప్పటి వరకు మందు కనుక్కోలేకపోయారు. కాగా.. దీనికి మించిన ప్రాణాంతక వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కరోనాను మించి చైనాలో మరో రెండు వైరస్ లు తయారయ్యారనే వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిని మించిన వైరస్ ఇప్పుడు ప్రజలను మరింత భయబ్రాంతులను చేస్తోంది.

కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతున్న అమెరికాకి తాజాగా మరో ముప్పు వచ్చిపడింది. ఫ్లోరిడాలోని ఓ వ్యక్తికి మెదడును హరించే అరుదైన, ప్రాణాంతక అమీబాతో ఇన్ఫెక్షన్ సోకినట్టు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

నాగ్లేరియా ఫౌలేరిగా వ్యవహరించే ఈ అమీబా సాధారణంగా సరస్సులు, నదులు, చెరువులు, కాలువల్లోని వెచ్చటి తాజా నీళ్లలో ఉంటుందని వెల్లడించారు. ‘‘ఆ నీళ్లను ముక్కులకు తగలకుండా జాగ్రత్త పడాలి. ముక్కు రంధ్రాల గుండానే ఈ అమీబా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఎక్కువగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనే విస్తృతంగా వ్యాపిస్తుంది..’’ అని అధికారులు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios