Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. పబ్జీ గేమ్ ఆడొద్దన్నందుకు.. తల్లితో సహా, అన్నా, అక్కాచెల్లెళ్లను కాల్చి చంపిన బాలుడు..

14 ఏళ్ల బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉంటూ.. నిత్యం ఆన్లైన్లో పబ్జీ ఆడుతూ.. దానికి బానిస అయ్యాడు. చదువును పక్కన పెట్టేశాడు. ఈ క్రమంలో తల్లి పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయమై కుమారుడిని ఘటన జరిగిన రోజు మళ్లీ మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు కబోర్డ్ లో ఉన్న తుపాకి తీసుకుని తల్లితో పాటు  సోదరుడు (22), ఇద్దరు సోదరీమణులు (17), (11)లను కాల్చి చంపాడు.

boy shoots four family members including mother under pubg influence in pakistan
Author
Hyderabad, First Published Jan 29, 2022, 6:43 AM IST

లాహోర్ : నిత్య PUBG game ఆడుతూ దానికి బానిసైన ఓ బాలుడు ఏకంగా తన కుటుంబ సభ్యులను కడతేర్చాడు. తల్లి, సోదరుడుతో పాటు ఇద్దరు సోదరీమణులను shoot చేసిచంపాడు. ఈ దారుణ ఘటన Pakistanలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. Lahoreలోని కహ్నా ప్రాంతానికి చెందిన నహిద్ ముబారక్ (45) హెల్త్ వర్కర్ గా పనిచేస్తోంది.  కొన్నేళ్ళ క్రితమే భర్తతో విడిపోయి.. పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది.

అయితే 14 ఏళ్ల కుమారుడు ఇంట్లో ఒంటరిగా ఉంటూ.. నిత్యం ఆన్లైన్లో పబ్జీ ఆడుతూ.. దానికి బానిస అయ్యాడు. educationను పక్కన పెట్టేశాడు. ఈ క్రమంలో తల్లి పలుమార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదే విషయమై కుమారుడిని ఘటన జరిగిన రోజు మళ్లీ మందలించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాలుడు కబోర్డ్ లో ఉన్న Gun తీసుకుని తల్లితో పాటు  సోదరుడు (22), ఇద్దరు సోదరీమణులు (17), (11)లను కాల్చి చంపాడు.

ఆ తర్వాత తన కుటుంబాన్ని ఎవరో చంపారంటూ పొరుగింటి వారికి తెలియజేశాడు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతుల ఇంటికి చేరుకున్న పోలీసులు బాలుడిని విచారించారు. అయితే తనకు ఏమీ తెలియదని.. ఘటన జరిగినప్పుడు తాను ఇంటిపైన ఉన్నానని బాలుడు బుకాయించాడు అనుమానంతో పోలీసులు కాస్త గట్టిగా విచారించడంతో.. నిజం అంగీకరించాడు. 

హత్య చేసిన తర్వాత తుపాకీని మురికి కాలువలో పడేసినట్లు తెలిపాడు. సంఘటన సమయంలో అతడు ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పబ్జి కి బానిసై పోవడంతో బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం తరలించినట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా,  నిరుడు నవంబర్లో భారత్ లోని ఉత్తరప్రదేశ్ లక్నోలో ఇలాంటి ఘటనే జరిగింది.  పబ్జి గేమ్ ఇద్దరు మైనర్ పిల్లల ప్రాణాలు తీసింది. చుట్టూ పరిసరాలను పట్టించుకోకుండా ట్రాక్ పై పబ్జి ఆడుతున్న ఇద్దరు బాలురు  మీది నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో వారిద్దరూ ట్రాక్ పైన విగతజీవి అయ్యారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.  వారు చూసేసరికి ఒక ఫోన్ లో పబ్జి గేమ్ రన్ అవుతుండటం స్థానికులు గమనించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మాథుర-కాస్ గంజ్ మధ్య ఉన్న రైల్వే ట్రాక్ పై నవంబర్ 21న చోటుచేసుకుంది.

మాథురలోని లక్ష్మీ నగర్ ఏరియాకు చెందిన వీరిద్దరి పదో తరగతి చదువుతున్నారు. మార్నింగ్ వాక్ కోసం బయలుదేరారు. అయితే వారు రైల్వే ట్రాక్ వాకింగ్ చేస్తూ, ఆన్లైన్ గేమ్ పబ్జి ఆడుతూ.. చేయడంతో చుట్టూ పరిసరాలను మరచిపోయి.. నడుస్తున్నారు. దీంతో రైల్వే ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలు శబ్దం కూడా వారికి తెలియకుండా పోయింది. ఆ గూడ్స్ ట్రైన్ వారి మీద నుంచి వెళ్ళిపోయింది. దీంతో ఆ పిల్లలు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios