దొంగతనానికి వచ్చి..ఈ దొంగ ఏం చేశాడో తెలుసా?
తాజాగా ఓ దొంగ సెల్ ఫోన్ లో చోరీ చేయడానికి వచ్చాడు. ఆయన అక్కడకు వచ్చాక గుర్తుకు వచ్చింది. అక్కడ సీసీ కెమేరాలు ఉంటాయి, తన ముఖం కనపడిపోతుందని. అందుకే తన ముఖాన్ని కవర్ చేయడం కోసం ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ తెగ నవ్విస్తోంది.

మీరు చాలా మంది దొంగలను చూసే ఉంటారు. దొంగలు దొంగతనానికి వచ్చినప్పుడు, తమను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలని ముఖానికి మాస్క్ ధరిస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా నలుపు రంగు పూసుకోవడం అలా ఏదో ఒక విధంగా తమ ముఖాన్ని కవర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఓ దొంగ సెల్ ఫోన్ లో చోరీ చేయడానికి వచ్చాడు. ఆయన అక్కడకు వచ్చాక గుర్తుకు వచ్చింది. అక్కడ సీసీ కెమేరాలు ఉంటాయి, తన ముఖం కనపడిపోతుందని. అందుకే తన ముఖాన్ని కవర్ చేయడం కోసం ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ తెగ నవ్విస్తోంది.
ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా? ఓ అట్ట పెట్టను ముఖానికి కవర్ చేసుకొని వచ్చి చోరీ చేశాడు. కానీ సెల్ ఫోన్ లు కొట్టేస్తున్న ఆనందంలో ఆ అట్టపెట్ట తన ముఖం నుంచి తొలగిపోయిందని గమనించలేదు. ఇంకేముంది.. సీసీ కెమేరాల చిక్కాడు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫ్లోరిడాలోని ఓ సెల్ ఫోన్ దుకాణంలో ఇటీవల ఓ దొంగతనం జరిగింది. దొంగతనం జరిగినట్లు గుర్తించిన దుకాణం యాజమాన్యం సీసీ కెమేరాల్లో రికార్డు అయిన వీడియోని పరిశీలించింది. కాగా, అందులో ఓ వ్యక్తి ముఖానికి అట్ట పెట్ట అడ్డు పెట్టుకొని చోరీ చేయడానికి వచ్చినట్లు గుర్తించారు.
చాలా తెలివిగా ముఖానికి అట్ట పెట్ట పెట్టుకోవడంతో అతను ఎవరో గుర్తించడం కష్టమైంది. కానీ, అతను ఫోన్లు దొరికిన ఆనందంలో బాక్స్ తొలగిపోయింది చూసుకోలేదు. ఇంకేముంది.. అతని ముఖం స్పష్టంగా కనపడింది. అతని ఫోటోని సేవ్ చేసుకొని.. అందరికీ ఈ వీడియో చూపించి చివరకు దుకాణం యజమానే స్వయంగా దొంగను పట్టుకున్నాడు. అనంతరం అతనే పోలీసులకు అప్పగించాడు.