బోర్ కొట్టిందని ఏది పడితే అది చేయద్దు. మొదటికే మోసం వస్తుంది. రష్యాలో అలా చేసిన ఓ సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పడ్డాడు. ఇంతకీ అతను చేసిన పనేంటంటే.. బోర్ కొట్టి పెయింటింగ్ మీద కళ్లు గీశాడు.. దీనికే ఉద్యోగం తీసేస్తారా అంటే.. విషయం తెలిస్తే మీరూ కరెక్టే అంటారేమో... 

రష్యా : బోర్ కొట్టిందని ఓ Security Guard చేసిన ఘనకార్యం మొదటి రోజే తన ఉద్యోగాన్ని ఊడగొట్టింది. Galleryలో ఉంచిన కోట్ల రూపాయల విలువైన పెయింటింగ్ ను రక్షించాల్సిన వ్యక్తి.. దానిపై penతో గీతలు గీసి నిర్వాహకుల ఆగ్రహానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే…

తెలుగు సినిమాల్లో చూపించినట్టు 
Modern Art సామాన్యులకు అర్థం కాదు. వారికి అవసరం కూడా లేదేమో...దీనివల్ల ఏవేవో చేసి చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఇలాంటి పనే చేశాడు ఆ సెక్యురిటీ గార్డు కూడా.. కోట్లాది రూపాయల విలువైన పెయింటింగ్ లో బొమ్మలకు కళ్లు లేకపోవడం అతనికి నచ్చలేదు. ఇదేం.. పేయింటింగ్ అనుకున్నాడో ఏమో.. తన దగ్గరున్న బాల్ పాయింట్ పెన్నుతో ఎంచక్కా కళ్లు దిద్దేసి.. హమ్మయ్యా.. ఇప్పుడు బాగుంది.. అని చూసుకుని మురిసిపోయాడు.. ఈ విషయం బయటపడడంతో ఉద్యోగం కాస్తా ఊడింది. 

తాను చేసిన తప్పేంటో పాపం.. ఆ సెక్యూరిటీ గార్డుకు అర్థమయ్యిందో లేదో.. అర్థం కాకుండా ఉద్యోగంలో ఎలా చేరతాడూ? అంటే ఏమో సెక్యూరిటీ గార్డ్ పనికి విషయావగాహన అవసరమా? అనే ప్రశ్నలు వెంటవెంటనే మనసులో మెదులుతూనే ఉంటాయి. అయితే విషయం మాత్రం విచిత్రంగా అనిపిస్తుంది.. కాసేపు నవ్వు తెప్పిస్తోంది. 

రష్యాలోని Boris Yeltsin Presidential Centerలో ఓ వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరాడు. అక్కడి ఆస్తుల్ని రక్షించాల్సిన ఆ వ్యక్తికి మొదటిరోజే విసుగ్గా అనిపించింది. దాంతో అక్కడ ప్రదర్శనలో ఉన్న ‘Three figures’ పెయింటింగ్ పై తన విసుగును చూపించాడు. ఆ పెయింటింగ్ లో ఉన్న మూడు చిత్రాలకు ముఖాకృతి ఖాళీగా ఉన్నట్లు కనిపించింది. ఈ గార్డ్ అందులోని రెండు ముఖాలపై తన బాల్ పాయింట్ పెన్నుతో కళ్ళు తీశాడు.

2021 డిసెంబరు 7న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రదర్శనను వీక్షించేందుకు వచ్చిన కొందరు ఈ మార్పును గుర్తించి, నిర్వాహకులకు తెలియజేశారు. ఆ పని చేసింది ఎవరో తెలుసుకున్న యాజమాన్యం అతడిని విధుల్లో నుంచి తొలగించింది. అన్నా లెపోర్క్సాయ ‘త్రీ ఫిగర్స్’ పేరిట ఈ కళాఖండాన్ని సృష్టించారు. ఈ కళాఖండం వాస్తవ ధరపై స్పష్టత లేదు. కానీ.. దీని పేరిట రూ.7.51 కోట్ల విలువైన భీమా ఉంది. కాగా, ఆ పెయింటింగ్ పై పెన్నుతో బలంగా గీయకపోవడంతో పెద్దగా నష్టం వాటిల్లదని తెలుస్తోంది. అయితే దానికి పూర్వ రూపం తెచ్చేందుకు రూ. 2.5 లక్షలు ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Scroll to load tweet…