ఫీలిప్పిన్స్‌లో బాంబు పేలుడు చోటు చేసుకుంది. దేశ దక్షిణ ప్రాంతంలోని జోలో ద్వీపంలోని ఓ చర్చిలో ఆదివారం కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు జరిపేందుకు గుడిగూడారు. వారిని లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు పేలుడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలవ్వగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.