Asianet News TeluguAsianet News Telugu

వీడుతున్న మిస్టరీ... కంటైనర్ లో 39 మృతదేహాలు

కంటెయినర్‌లో మృతుల ఘటన వెనుక మనుషుల అక్రమ రవాణాదారుల హస్తం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సాధారణంగా మనుషులను అక్రమంగా రవాణా చేసే ముఠాలు ఈ లారీ వచ్చిన మార్గాన్ని ఎంచుకోవని అధికారులు అంటున్నారు. బల్గేరియా నుంచి బ్రిటన్‌కు వచ్చే హోలీహీడ్‌లోని వెల్ష్‌పోర్ట్‌ మార్గంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని చెప్పారు. 

Bodies in truck container identified as Chinese nationals
Author
Hyderabad, First Published Oct 25, 2019, 7:18 AM IST

ఓ కంటైనర్ లో 39 మృతదేహాల మిస్టరీ వీడుతోంది. ఆ మృతదేహాలు ఎవరివో పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. చైనా దేశానికి చెందిన వారిగా... ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే..  లండన్‌లోని ఎసెక్స్‌కు చెందిన గ్రేస్‌ ప్రాంతంలో ఓ అనుమానాస్పద కంటెనైర్‌ను తనిఖీ చేస్తుండగా.. అందులో 39 డెడ్ బాడీస్ పట్టుబడ్డాయి. అందులో 38 మంది పెద్దవారివి కాగా.. ఒక టీనేజర్‌ బాడీ కూడా ఉన్నట్లుగా ఎసెక్స్‌ పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఇమిగ్రేషన్‌ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆ కంటైనర్‌ని పోలీసులు సమీపంలోని టిల్‌బరీ డాక్స్‌ అనే ప్రాంతానికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే లారీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఆ మృతదేహాలు ఎవరివన్న దానిపై విచారిస్తుండగా.. ఓ సంచలన విషయం బయటపడుతోంది. ఆ 39 డెడ్‌ బాడీస్ మన పొరుగుదేశమైన చైనాకి సంబంధించినవిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఎసెక్స్‌ పోలీసులు, చైనా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. 2000 సంవత్సరంలో చైనాకు చెందిన 58 మంది మృతదేహాలను డచ్‌కు చెందిన లారీలో డోవర్‌ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి పట్టుబడ్డ మృతదేహాలు కూడా చైనీయులవిగా భావిస్తున్నారు.

కంటెయినర్‌లో మృతుల ఘటన వెనుక మనుషుల అక్రమ రవాణాదారుల హస్తం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సాధారణంగా మనుషులను అక్రమంగా రవాణా చేసే ముఠాలు ఈ లారీ వచ్చిన మార్గాన్ని ఎంచుకోవని అధికారులు అంటున్నారు. బల్గేరియా నుంచి బ్రిటన్‌కు వచ్చే హోలీహీడ్‌లోని వెల్ష్‌పోర్ట్‌ మార్గంలో ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని చెప్పారు. 

ఈ ఘటన, ప్రజలను లారీలలో అక్రమంగా తరలించే వలస గ్యాంగ్‌లతో పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియజేస్తున్నదని బ్రిటన్‌ రోడ్‌ హాలేజ్‌ అసోసియేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌ బర్నెట్‌ పేర్కొన్నారు. ఆ కంటెయినర్‌ రిఫ్రిజ రేటర్‌ యూనిట్‌ అని, అందులో మైనస్‌ 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని, ఆ వాతా వారణంలో ఉండేవారి పరిస్థితిని అర్థం చేసుకోవచన్నని అన్నారు. 

2000 సంవత్సరంలో బ్రిటన్‌లోని డోవర్‌ ప్రాంతంలో చైనాకు చెందిన 58 మంది వలసదారులు ఓ లారీలో ఊపిరాడక మరణించారు. ఆ లారీలో అక్రమంగా వచ్చిన వారిలో ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారిని అక్రమంగా తరలించిన డచ్‌ లారీ డ్రైవర్‌కు ఊచకోత నేరం కింద జైలు శిక్ష విధించారు. 2014లో ఆఫ్ఘన్‌కు చెందిన 34 మంది సిక్కులు ఓ నౌకా కంటెయినర్‌లో స్పృహ తప్పిన స్థితిలో కనిపించారు. అయితే వీరిలో అప్పటికే ఒక వ్యక్తి మరణించాడు. వీరంతా బెల్జియం నుంచి సముద్ర మార్గంలో బ్రిటన్‌ చేరుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios