పాకిస్తాన్  పెషావర్ లో  ఇవాళ   బాంబు  పేలుడు చోటు  చేసుకుంది.  ఈ ఘటనలో  సుమారు  50 మంది  గాయపడ్డారు. గాయపడిన వారిని  ఆసుపత్రికి తరలించారు.  

ఇస్లామాబాద్: పాకిస్తాన్ పెషావర్ లో సోమవారం నాడు  బాంబు పేలుడు చోటు  చేసుకుంది.  ఈ ఘటనలో  సుమారు  50 మందికి పైగా  గాయపడ్డారు. గాయపడిన వారిని  ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో  ప్రాణ నష్టం ఎక్కువగా  ఉండే అవకాశం ఉందని  అధికారులు అనుమానిస్తున్నారు.   జుహర్ ప్రార్థనల అనంతరం  పోలీస్ లైన్స్ ఏరియా సమీపంలో పేలుడు చోటు  చేసుకుందని  స్థానిక మీడియా తెలిపింది.  పేలుడు తాకిడికి  మసీదు  ఒకవైపు కుప్పకూలిపోయింది.   పెషావర్  లోని  పోలీస్ లైన్స్ ఏరియా మసీదు వెలుపల  ఓ వ్యక్తి  ఆత్మాహుతికి పాల్పడినట్టుగా  జియో న్యూస్ వెల్లడించింది.  ఈ ఘటనలో  50 మందికి పైగా గాయపడ్డారు.

 గాయపడిన  వారిని  పెషావర్ లోని  లేడీ రీడింగ్  ఆసుపత్రికి తరలించినట్టుగా  అధికారులు తెలిపారు.  గాయపడిన వారిలో  13 మంది పరిస్థితి విషమంగా  ఉందని  అధికారులు తెలిపారు.  పేలుడు చోటు  చేసుకున్న ప్రాంతంలో  అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ ప్రాంతాన్ని  పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.