Asianet News TeluguAsianet News Telugu

పాక్‌ను ప్రపంచానికి శత్రువుని చేశారు: ఇమ్రాన్‌పై జూనియర్ భుట్టో ఫైర్

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు భిలావల్ భుట్టో ఫైరయ్యారు. పాకిస్తాన్‌ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారని ధ్వజమెత్తారు. 

bilawal bhutto fires on Pakistan Pm Imran Khan
Author
Islamabad, First Published Mar 14, 2019, 2:44 PM IST

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌పై మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు భిలావల్ భుట్టో ఫైరయ్యారు. పాకిస్తాన్‌ను ప్రపంచానికి శత్రుదేశంగా మార్చేశారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌తో అన్ని దేశాలు సంబంధాలు తెంచుకుంటున్నాయని.. ప్రధాని ఇమ్రాన్ తీసుకుంటున్న చర్యల వల్లే ఇదంతా జరుగుతోందన్నారు.

ఉగ్రవాద నియంత్రణ చర్యలు  తీసుకుంటుంటే ప్రపంచ దేశాలు పాక్‌పై ఎందుకు మండిపడుతున్నాయని బిలావల్  ప్రశ్నించారు. ఇమ్రాన్ ప్రభుత్వంలోని ముగ్గురు  మంత్రులకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు.

భారత్-పాక్ మధ్య ఎప్పటి నుంచో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఎందుకు ఎక్కువయ్యాయని భుట్టో ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ నిజంగా శాంతిని కోరకుంటుంటే ముందు ప్రపంచ దేశాల ప్రశ్నలకు సమాధానం చెప్పండి.

మీరు ఉగ్రవాద నియంత్రణ పట్ల నిజాయితీగా ఉన్నట్లయితే మేం చెప్పే మూడు విషయాలను తీవ్రంగా తీసుకోవాలంటూ సూచనలు చేశారు. ‘‘పార్లమెంట్‌లో నేషనల్ సెక్యూరిటీ కమిటీ’’ని నియమించండి,

నిషేధిత ఉగ్రవాద సంస్ధలకు మద్ధతివ్వడం ఆపేయండి. లేదా వారికి దూరంగా ఉండండి. ‘‘ మీ మంత్రి వర్గంలో ఉంటూ నిషేధిత సంస్ధలతో సంబంధాలు  కొనసాగిస్తున్న వారిపై విచారణ జరిపి వారిని తొలగించండి’’ అంటూ తెలిపారు.

ఈ సూచనలను వెంటనే అమలు చేసినట్లయితే  ఉగ్రవాద నియంత్రణకు పాక్ ప్రభుత్వం కృషి చేస్తుందని నాతో పాటు అందరూ నమ్ముతారని భిలావల్ స్పష్టం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios