అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురువారం కీలక ప్రకటన చేశారు. కరోనా వల్ల తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా భారీ ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు. కొవిడ్ నియంత్రణ, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజిని ప్రకటించారు.

బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ఈ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రవేశపెడతామని బైడెన్ ప్రతిపాదించారు. దీని ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు.
దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు 160 బిలియన్ డాలర్లు, మరో 170 బిలియన్ డాలర్లు పాఠశాలలకు కేటాయించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టే తన తొలి వంద రోజుల పాలనలో 100 మిలియన్ల మందికి టీకా అందించాలనే ఉద్దేశంతో అమెరికా రెస్క్యూ పేరిట మరో ప్రణాళికను కూడా ఈ సందర్భంగా బైడెన్ ప్రకటించారు.
ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం మరో దఫా సాయం అందించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. జో బైడెన్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజధాని వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. ఈ నెల 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎమర్జెన్సీ జనవరి 24వరకు కొనసాగుతుందని వైట్‌హౌజ్ వెల్లడించింది.