టాంజానియా: మిస్ టాంజానియాగా ఎంపికైన బ్యూటీ క్వీన్ జాక్లీన్ చువాను ఆమె భర్త కొట్టాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెపై భార్త దాడికి పాల్పడ్డాడు.

2008లో టాంజానియా దేశంలో మిస్ బగామోయూగా  జాక్లీన్  టైటిల్ గెలుచుకొంది. అందాల సుందరి జాక్లీన్.... లియోనిస్ నగసా అనే యువకుడిని రెండు మాసాల క్రితం పెళ్లాడింది. పెళ్లైన రెండు నెలలకే జాక్లీన్ టబటా హైస్కూల్ వద్ద మరో వ్యక్తితో కలిసి ఉండగా లియోనిస్ ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.

తనను పెళ్లి చేసుకొన్న  రెండు మాసాలకే భార్య మోసం చేసే మరో వ్యక్తితో ఉండడం చూసి ఆగ్రహంతో బ్యూటీ క్వీన్ జాక్లీన్‌పై భర్త లియోనిస్ చేయి చేసుకొన్నాడు. దీంతో గాయపడిన జాక్లీన్‌ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు  శస్త్రచికిత్స చేశారు. టాంజానియా పోలీసులు వచ్చి భార్యపై దాడి చేసి కొట్టిన భర్త లియోనిస్‌ను అరెస్ట్ చేశారు.