Asianet News TeluguAsianet News Telugu

సంచలన తీర్పు.. విద్యార్థి హత్య కేసులో 20 మందికి మరణశిక్ష

తోటి విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటణనకు సంబంధిచిన  ఓ కేసులో 20 మంది యూనివర్సిటీ విద్యార్థులకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. అలాగే, మరో ఐదుగురు విద్యార్థులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. బంగ్లదేశ్ కోర్టు వెలువరించిన ఈ తీర్పు ప్రస్తుతం సంచలనంగా మారింది. 
 

Bangladesh Court Sends 20 Students to Death Row for Killing University Peer
Author
Hyderabad, First Published Dec 9, 2021, 9:58 AM IST

అంతర్జాతీయంగా ప్రభుత్వం చేసుకున్న ఓ ఒప్పందాన్ని సోషల్  మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ లో విమర్శించిన ఓ యూనివర్సీటి విద్యార్థిని అతి దరుణంగా దాడి చేసి చంపిన కేసులు 20 మంది వర్సీటీ విద్యార్థులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. మ‌రో ఐదుగురు విద్యార్థుల‌కు జీవిత ఖైదు విధించింది. బంగ్లాదేశ్ లోని ఢాకా కోర్టు వెలువ‌రించిన ఈ తీర్పు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌కు తెర‌దీసింది. వివ‌రాల్లోకెళ్తే.. Bangladesh University of Engineering and Technology (BUET) లో అబ్రార్ ఫహాద్ (21) అనే యువ‌కుడు చ‌దువుకుంటున్నాడు.  అయితే,  అబ్రార్ ఫ‌హాద్ చ‌నిపోవ‌డానికి ముందు ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశాడు. అందులో   షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం.. భారతదేశంతో న‌ది జ‌లాల గురించి ఒప్పందం చేసుకున్న విష‌యాల‌ను ప్ర‌స్తావించాడు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశాడు. (గంగా న‌ది జలాల విష‌యంలో భార‌త్‌- బంగ్లాదేశ్‌ల మ‌ధ్య చాలా కాలం నుంచి ప‌లు వివాదాలు ఉన్నాయి). ఫ‌హాద్ చేసిన ఫేస్ బుక్ ఫోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

ఫ‌హాద్ చేసిన ఫేస్ బుక్ ఫోస్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన త‌ర్వాత యూనివ‌ర్సిటీలోని ఛత్రా లీగ్ కార్యకర్తలు అతన్ని పిలిచారు. ఈ క్ర‌మంలోనే అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగం అవామీ లీగ్, బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (బీసీఎల్) సభ్యులైన 25 మంది తోటి విద్యార్థులు అబ్రార్ ఫహద్‌ను అతి దారుణంగా హింసించి ప్రాణాలు తీశారు.  క్రికెట్ బ్యాట్, ఇతర వస్తువులతో దాదాపు 6 గంటలపాటు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న 2019 అక్టోబ‌ర్ 7న జ‌రిగింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ఆయా విద్యార్థి సంఘాల‌తో పాటు షేక్ హాసీనా ప్ర‌భుత్వంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్ర‌జాగ్ర‌హం మొద‌లైంది. ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు కొన‌సాగించారు. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న స‌ర్కారు.. కేసు విచార‌ణ‌ను ప్ర‌త్యేక క‌మిటీ వేయించింది. ఈ నేప‌థ్యంలోనే అబ్రార్  ఫ‌హాద్ హ‌త్య‌కు సంబంధించిన కేసు తీర్పు బుధ‌వారం నాడు బంగ్ల‌దేశ్‌లోని ఢాకా న్యాయ‌స్థానం వెల్ల‌డించింది. అబ్రార్ ఫ‌హాద్ ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మైన మొత్తం 25 మంది విద్యార్థుల‌కు శిక్ష‌లు ఖ‌రారు చేసింది.  వారిలో 20 మందికి మ‌ర‌ణ‌శిక్ష విధిస్తూ సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. అలాగే, మ‌రో ఐదుగురికి జీవిత‌ఖైదు విధించింది. 

బంగ్ల‌దేశ్ న్యాయ‌స్థానం తీర్పుతో చ‌నిపోయిన విద్యార్థి అబ్రార్  ఫ‌హాద్ కుటుంబానికి న్యాయం జ‌రిగింద‌ని ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పుపై మృతుడు అబ్రార్ ఫహద్ తండ్రి బర్కత్ ఉల్లా కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ... కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ శిక్షను త్వరలోనే అమలు చేస్తారంటూ ఆశాభావంతో ఉన్నారు. తన కుమారుడ్ని దాడి చేసి హత్య చేసిన ఘటనలో మిగతా ఐదుగురు నిందితులకు  జీవిత ఖైదు విధించినట్లు ప్రాసిక్యూటర్ అబ్దుల్లా అబు ఏఎఫ్‌పీ మీడియాకు తెలిపారు. దీనిపై యూనివ‌ర్సీటి ప్రొఫెస‌ర్లు మాట్లాడుతూ.. చ‌నిపోయిన విద్యార్థితో పాటు శిక్ష ప‌డిన విద్యార్థులంద‌రూ ప్ర‌తిభ క‌లిగిన వారేన‌ని అన్నారు.  అయితే, ఆ విద్యార్థులు ఇంత‌టి నేరాలు పాల్ప‌డ‌టానికి, ఇలా వారు మార‌డానికి గ‌త కార‌ణాల‌ను వెలికి తీయ‌డంతో పాటు, వాటిని న‌రిష్క‌రిస్తేనే మున్ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉంటాయ‌న్నారు. ఇదిలావుండ‌గా, బంగ్ల‌దేశ్‌లో ఇలా చాలా పెద్ద సంఖ్య‌లో ఉరిశిక్ష‌లు విధించ‌డం బ్రిటీష్ కాలం నుంచి కొన‌సాగుతోంది. ఈ ఏడాది  ఆగస్టులో, ఇద్దరు స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలను హత్య చేసిన కేసులో ఆరుగురు ఇస్లామిస్ట్ తీవ్రవాదులకు మరణశిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios