జకార్తా: సముద్రంలో కుప్పకూలిన ఇండోనేషియా విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీని అధికారులు కనుగొన్నారు.

బ్లాక్ బాక్సుల సిగ్నల్స్ ను గుర్తించారు. ఈ బ్లాక్ బాక్సులను వెలికితీసే పనిలో అధికారులున్నారు. జకార్తాలో విమానం బయలుదేరిన కొంత సేపటికే విమానం కుప్పకూలిపోయింది.

ఎస్‌జే 182 విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాడార్ నుండి అదృశ్యమైంది. ఆదివారం నాడు ఉదయం లాంకాంగ్, లకీ ద్వీపాల మధ్య ఈ విమాన శకలాలు, మనుషుల శరీర భాగాలు, దుస్తులు తదితర వస్తువులు లభ్యమయ్యాయి.

శ్రీ విజయ ఎయిర్ కు చెందిన జెట్ విమానంలో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు శిశువులతో పాటు 62 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.