రెండు ఓడలు  ప్రమాదానికి గురై.. 11మంది సజీవదహనమైన సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఇండియన్, టర్కిష్, లిబియన్ దేశాలకు చెందిన సిబ్బంది రెండు ఓడల్లో వెళ్తుండగా.. ప్రమాదానికి గురయ్యాయి.  రెండు ఓడలు టాంజానియా దేశ జెండాలతో వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

ఒక ఓడలో ద్రవీకృత సహజవాయుడు( లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ని తీసుకువెళుతుండగా.. మరో ఓడలో ట్యాంకర్ ని తీసుకువెళుతున్నారు. ఒక ఓడలో నుంచి గ్యాస్ ని మరో ఓడలోకి పంపిస్తుండగా.. మంటలు వ్యాపించాయి. 

ఒక ఓడలో మొత్తం 17మంది సిబ్బంది ఉండగా.. అందులో టర్కిష్ కి చెందిన వారు 9మంది కాగా.. 8మంది భారతీయులు ఉన్నారు. మరో ఓడలో మొత్తం 15మంది సిబ్బంది ఉండగా.. అందులో ఏడుగురు టర్కిష్ దేశస్థులు కాగా.. మరో ఏడుగురు భారతీయులు ఒకరు లిబియాకి చెందినవారని రష్యా న్యూస్ ఎజెన్సీ ప్రకటించింది.

ఈ రెండు ఓడల్లోని సిబ్బందిలో కొందరు తెలివిగా ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా,.. 11మంది మాత్రం మృత్యువాతపడినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.