Asianet News TeluguAsianet News Telugu

air strike: వైమానిక దాడి.. 100 మందికి పైగా మృతి !

air strike: యెమెన్ లో దీర్ఘకాలికంగా కొన‌సాగుతున్న ఘర్షణ..  శుక్రవారం నాడు తీవ్ర హింస‌కు దారి తీసింది. అక్క‌డి జైలుపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 100 మంది మరణించారు. వేరు వేరు చోట్ల జ‌రిగిన మ‌రో వైమానిక దాడిలో ముగ్గురు పిల్ల‌లు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి హౌతీ తిరుగుబాటుదారులు వీడియో దృశ్యాల‌ను విడుదల చేశారు. జైలు పై జ‌రిగిన వైమానిక దాడిలో శిథిలాల కింద‌, అలాగే, చెల్లాచెదురుగా ప‌డివున్న శ‌వాల‌ను బ‌య‌ట‌కు తీస్తున్న భ‌యాన‌క దృశ్యాలు ఆ వీడియోలో క‌నిపించాయి. 
 

At Least 100 Killed In Airstrike On Yemen Prison
Author
Hyderabad, First Published Jan 22, 2022, 4:56 AM IST

air strike: యెమెన్ లో దీర్ఘకాలికంగా కొన‌సాగుతున్న ఘర్షణ..  శుక్రవారం నాడు తీవ్ర హింస‌కు దారి తీసింది. అక్క‌డి (Yemen) జైలుపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 100 మంది మరణించారు. వేరు వేరు చోట్ల జ‌రిగిన మ‌రో వైమానిక దాడిలో ముగ్గురు పిల్ల‌లు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి హౌతీ తిరుగుబాటుదారులు వీడియో దృశ్యాల‌ను విడుదల చేశారు. జైలు పై జ‌రిగిన వైమానిక దాడిలో శిథిలాల కింద‌, అలాగే, చెల్లాచెదురుగా ప‌డివున్న శ‌వాల‌ను బ‌య‌ట‌కు తీస్తున్న భ‌యాన‌క దృశ్యాలు ఆ వీడియోలో క‌నిపించాయి. చాలా కాలం నుంచి యెమన్ (Yemen), సౌదీ అరేబియా (Saudi Aarabia) నేతృత్వంలోని సంకీర్ణ దేశాల మధ్య ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. నిత్యం ఈ రెండు దేశాల కూట‌ములు ఒకదానిపై మరొకటి వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే యెమెన్‌లోని సాదా జైలుపై సౌదీ సంకీర్ణ బలగాలు వైమానిక దాడులకు పాల్ప‌డ్డాయి. సాదా జైలుతో పాలు ప‌లు చోట్ల బాంబుల వ‌ర్షం కురింపించ‌డంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయార‌ని స‌మాచారం. ఇంకా వంద‌ల మంది క్ష‌త‌గాత్రులు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారు. 

ఆ దాడుల్లో తీవ్రంగా గాయ‌ప‌డిన వారిలో ప‌లువురి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌నీ, మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని Médecins Sans Frontières (MSF) పేర్కొంది.  సౌదీ అరేబియా (Saudi Aarabia) నేతృత్వంలోని సంకీర్ణ దేశాల బ‌ల‌గాలు జ‌రిపిన ఈ వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నార‌ని యెమన్‌లోని రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ పేర్కొంది.  సాదాతో పాటు యెమెన్‌లోని తీరప్రాంత నగరం హౌడైదాలో కూడా మరో వైమానిక దాడి జరిగింది. అక్క‌డి టెలి కమ్యూనికేషన్ కేంద్రాన్ని టార్గెట్ చేసుకొని ఈ దాడులు కొన‌సాగించారు. ఈ స‌మ‌యంలో అక్క‌డి ఫుట్ బాల్ ప్రాంగ‌ణంలో ఆడుకుంటున్న చిన్నారులు ప్రాణాలు కోల్పోయార‌ని సేవ్ ది చిల్డ్రన్ సహాయ సంస్థ తెలిపింది. ఈ వైమానిక దాడి కార‌ణంగా అక్క‌డి టెలీకమ్యూనికేషన్ సెంటర్ ధ్వంసంమవడంతో.. యెమెన్‌లో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. 

యెమెన్ రాజ‌ధాని న‌గ‌ర‌మైన సనాలో కూడా పలు చోట్ల సౌదీ అరేబియా (Saudi Aarabia) నేతృత్వంలోని సంకీర్ణ దేశాల బ‌ల‌గాలు వైమానిక దాడులకు పాల్ప‌డ్డాయి. కాగా, ప్రస్తుతం ఈ వైమానికి దాడుల‌కు  జనవరి 17న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై యెమన్ హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్  చేయ‌డ‌మేన‌ని తెలుస్తోంది. హౌతి తిరుగుబాటు దారులు ఈ డ్రోన్ దాడి త‌ర్వాతి నుంచి సౌదీ అరేబియా (Saudi Aarabia) నేతృత్వంలోని సంకీర్ణ దేశాల బ‌ల‌గాలు వైమానిక దాడులను మ‌రింత‌గా పెంచాయి. హౌతీ తిరుగుబాటు దారుల‌ను టార్గెట్ గా చేస‌కుని ఈ వైమానికి దాడులు కొన‌సాగిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటు దారులు అబుదాబి ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాది చేసిన త‌ర్వాత రోజే యెమెన్ రాజధాని సనాపై  వైమానిక దాడులు జరిపాయి. ఆ దాడుల్లో 11 మంది మరణించారు.  ఈ క్ర‌మంలోనే ఆయా దేశాల మ‌ద్య ఘర్ష‌ణ వాతావ‌ర‌ణం మ‌రింత ఉద్రిక్తంగా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios