పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్ధారీ
పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ శనివారం రెండోసారి ఎన్నికయ్యారు. 68 ఏళ్ల జర్ధారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ ఎన్) ఉమ్మడి అభ్యర్ధి కాగా.. అతని ప్రత్యర్ధి మహమూద్ ఖాన్ అచక్జాయ్ (75) సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (ఎస్ఐసీ) అభ్యర్ధి.
పాకిస్థాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ శనివారం రెండోసారి ఎన్నికయ్యారు. జర్దారీ ఇటీవలే జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నవాజ్ షరీఫ్‌కి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (PML)తో జతకట్టిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP)కి సహ-ఛైర్‌పర్సన్. అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు 255 ఓట్లు రాగా, ప్రత్యర్ధికి 119 ఓట్లు వచ్చినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
68 ఏళ్ల జర్ధారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ ఎన్) ఉమ్మడి అభ్యర్ధి కాగా.. అతని ప్రత్యర్ధి మహమూద్ ఖాన్ అచక్జాయ్ (75) సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ (ఎస్ఐసీ) అభ్యర్ధి. పాకిస్తాన్ రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం.. కొత్తగా ఎన్నికైన జాతీయ అసెంబ్లీ సభ్యుల ఎలక్టోరల్ కాలేజీ, నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలు జర్ధారీని ఎన్నుకున్నాయి. ఆయన వ్యాపారవేత్తగా మారిన రాజకీయవేత్త, జర్ధారీ హత్యకు గురైన పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త.
ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ పదవీకాలం గతేడాది ముగిసింది. ఆయన స్థానంలో ఆసిఫ్ అలీ జర్ధారీ నియమితులయ్యారు. అయితే కొత్త ఎలక్టోరల్ కాలేజీ ఇంకా ఏర్పాటు కాకపోవడంతో ఆయన పదవిలోనే కొనసాగుతున్నారు. ఆసిఫ్ అలీ జర్ధారీ 2008 నుంచి 2013 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాదు.. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు. జర్ధారీకి ప్రత్యర్ధి అయిన అచక్జాయ్.. పష్తూన్ఖ్వా మిల్లీ అవామీ పార్టీ అధినేత జైలులో వున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ మద్దతు ఆయన పొందారు.