Asianet News TeluguAsianet News Telugu

మరో షాక్: పాక్‌ను బ్లాక్‌లిస్టును పెట్టిన ఎఫ్ఏటీఎఫ్ ఏపీజీ

పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోని పాకిస్తాన్ కు ఆసియా-ఫసిఫిక్ గ్రూప్  (ఎఫ్ఏటీఎఫ్-ఏపీజీ) షాకిచ్చింది.

Another setback: FATF's Asia-Pacific Group blacklists Pakistan, downgrades financial status
Author
Australia, First Published Aug 23, 2019, 3:11 PM IST

ఇస్లామాబాద్: పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉగ్రవాదంపై తన వైఖరిని మార్చుకోని పాకిస్తాన్ కు ఆసియా-ఫసిఫిక్ గ్రూప్  (ఎఫ్ఏటీఎఫ్-ఏపీజీ) షాకిచ్చింది. పాక్ ను బ్లాక్ లిస్టులో చేర్చింది. అస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలో జరిగిన  ఎఫ్‌ఏటీఎఫ్‌-ఏపీజీ  సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.

ఉగ్రవాదం నిర్మూలన కోసం తీసుకొంటున్న చర్యలకు సంబంధించిన వివరాలను పాక్ ఇటీవల ఎఫ్ఏటీఎఫ్-ఏపీజీకి నివేదిక ఇచ్చింది. పాక్ తీసుకొన్న దాదాపు 40 రకాల  చర్యల్లో 32 ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలకు అనుగుణంగా లేవని ఆసియా-ఫసిఫిక్ గ్రూప్ అభిప్రాయపడింది. కీలకమైన 11 విషయాల్లో పాకిస్తాన్ 10 అంశాల్లో లక్ష్యాలను చేరుకోలేదని స్పష్టం చేసింది.

పాక్ తీసుకొంటున్న చర్యల విషయంలో  ఏ ఒక్కరూ కూడ సంతృప్తి చెందలేదు. పాకిస్తాన్ ను గ్రే లిస్టుల్ పెట్టాలని గత ఏడాది జూన్ లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.పాక్ లోని ఉగ్రవాద శిబిరాల విషయంలో ఆ దేశ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. 

ఈ విషయమై పాక్ ను పలుమార్లు హెచ్చరించినా కూడ మార్పు రాలేదు. ఉగ్రవాద ముఠాలకు ఆర్థిక మూలాలతో పొంచి ఉన్న ముప్పుపై సరైన అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేసింది

దీంతో ఎఫ్‌ఏటీఎఫ్‌ ఏపీజీ తదుపరి కార్యాచరణను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం, అక్రమ నగదు చలామణి లాంటి అంశాల్లో ఎఫ్‌ఏటీఎఫ్‌ చేసిన సూచనల అమలుకు చివరి గడువైన అక్టోబర్‌ నాటికైనా లక్ష్యాలను చేరుకోని పక్షంలో పాక్‌కు బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పదని హెచ్చరించింది. ఈ హెచ్చరికలను కూడ పాక్  పట్టించుకోలేదు. దీంతో పాకిస్తాన్ ను బ్లాక్ లిస్టులో పెట్టినట్టుగా ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios