ఆదివారం, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) టర్కీ ప్రాంతంలో మరో భూకంపం నమోదు చేసింది. టర్కీలోని కహ్రామన్‌మరాస్‌కు దక్షిణ-తూర్పుకి 24 కి.మీ దూరంలో 4.7 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించిందని యూఎస్జీఎస్ తెలియజేసింది.
టర్కీ : టర్కీలో ఆదివారం మరో భూకంపం సంభవించింది. ఈ తాజా భూకంపం టర్కీలోని కహ్రామన్‌మరాస్‌కు దక్షిణ-తూర్పుకి 24 కి.మీ దూరంలో 4.7 తీవ్రతతో సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలియజేసింది. ఇప్పటికే గతవారం సంభవించిన భూకంపంతో దేశంలోని అనేక నగరాలను శిథిలాలుగా మారాయి. ప్రస్తుతం వచ్చిన ఈ భూకంపం 15.7 కి.మీ లోతులో సంభవించినట్లు యూఎస్జీఎస్ సమాచారం ఇచ్చింది. భూకంపం 00:03:15 (UTC+05:30)కి సంభవించిందని కూడా ఏజెన్సీ తెలియజేసింది.
టర్కీలో సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, పదేపదే సంభవిస్తున్న ఈ భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 33,000 కు పెరిగిందని, శిథిలాల కింద ఉన్న వారందర్నీ రక్షిస్తామనే ఆశలు రోజురోజుకూ తగ్గుతున్నాయని తెలియజేసారు. గతవారం సంభవించిన.. టర్కీని ఛిన్నాభిన్నం చేసిన భూకంపం, రిక్టర్ స్కేలుపై 7 కంటే ఎక్కువ రికార్డును నమోదు చేసింది. ఈ భూకంపం, 1939 తర్వాత టర్కీలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం.
టర్కిష్ అధికారులు విపత్తు జోన్ అంతటా క్రమాన్ని కొనసాగించడానికి ప్రయత్నించారు. భవనాలు కూలిపోవడంపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. దక్షిణ టర్కీలోని అంటాక్యలో అత్యంత దెబ్బతిన్న నగరాలలో ఒకటైన మధ్య జిల్లాలో, వ్యాపార యజమానులు ఆదివారం నాడు తమ దుకాణాలు దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ముందుగానే తమ దుకాణాలను ఖాళీ చేశారు. ఇతర నగరాల నుండి వచ్చిన నివాసితులు, సహాయక కార్మికులు అధ్వాన్నమైన భద్రతా పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు. దుకాణాలు, కూలిపోయిన ఇళ్లలో దోపిడీలు జరిగినట్లు సమాచారం.
రెండు దశాబ్దాల అధికారంలో అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభుత్వం ఈ విధమైన అత్యంత కష్టతరమైన జాతీయ విపత్తును ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాదు భూకంపంపై తన స్పందనపై అనేక ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది సవాల్ గా మారింది. అంతేకాదు సందట్లో సడేమియాలాగా రెచ్చిపోతున్న దోపిడీదారులను కట్టడి చేయడానికి కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
బ్రేకింగ్ : టర్కీ భూకంప ఘటనలో భారతీయుడు మృతి
సిరియాలో, తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న వాయువ్య ప్రాంతాన్ని ఈ విపత్తు తీవ్రంగా దెబ్బతీసింది. దశాబ్దం నాటి అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే అనేకసార్లు వలసలు వెళ్లినఅనేక మంది ప్రజలు మళ్లీ నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతానికి తక్కువ సాయం అందింది.
"ఇప్పటివరకు వాయువ్య సిరియాలోని ప్రజలకు సాయం అందించడంతో విఫలమయ్యాం" అని ఐక్యరాజ్యసమితి సహాయ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ టర్కీ-సిరియా సరిహద్దు నుండి ట్వీట్ చేసారు, ఇక్కడ యూఎస్ సహాయ సామాగ్రి కోసం ఒకే క్రాసింగ్ మాత్రమే తెరవబడుతుంది.
మొదటి భూకంపం సంభవించిన ఆరు రోజుల తర్వాత, ఎమర్జెన్సీ రెస్క్యూ టీం.. ఇప్పటికీ వేలమందిని సమాధులుగా మార్చిన శిథిలాల కింద ప్రాణాలతో సహాయం కోసం వెతుకుతున్న వారిని కనుగొన్నారు.
చైనీస్ రెస్క్యూ సిబ్బంది,టర్కిష్ అగ్నిమాపక సిబ్బంది 54 ఏళ్ల సిరియన్ మాలిక్ మిలాండిని అంటాక్యాలోని శిథిలాలలో 156 గంటల తరువాత ఒకరిని సజీవంగా ఉండడం గుర్తించి రక్షించారు. కూలిపోయిన భవనాల శిథిలాల నుండి ఆదివారం బయటపడిన వారిలో ఒక తండ్రి , కుమార్తె, పసిబిడ్డ, 10 ఏళ్ల బాలిక ఉన్నారు, అయితే మృతుల సంఖ్య కనికరం లేకుండా పెరగడంతో అలాంటి దృశ్యాలు చాలా అరుదుగా మారాయి.
