Asianet News TeluguAsianet News Telugu

నాపై అత్యాచారం చేశారు.. పాక్ కేంద్ర మాజీ మంత్రిపై విదేశీ మహిళ ఆరోపణలు

మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో వైవాహిక జీవితంపై సింథియా డి రిచీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సింథియాపై గత వారం ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సైబర్‌ క్రైమ్‌ విభాగానికి పీపీపీ షెషావర్‌ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్‌ ఆప్ఘానీ ఫిర్యాదు చేశారు. 

American blogger Cynthia D Ritchie says then Pakistani interior minister raped her, ex-PM molested her
Author
Hyderabad, First Published Jun 6, 2020, 1:13 PM IST

తనపై పాకిస్థాన్ కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి రెహ్మాన్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ అమెరికా బ్లాగర్‌ సింథియా డి రిచీ సంచలన ఆరోపణలు చేశారు. 2011లో ఆయన పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రిగా ఉండగా తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని సింథియా పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని అధ్యక్ష భవనంలో మాజీ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ, మాజీ ఆరోగ్య మంత్రి మఖ్దూమ్‌ షాహబుద్దీన్‌ కూడా తనను శారీరకంగా వేధించారని ఆమె ఆరోపించారు.

ఈ ఘటన సమయంలో అసిఫ్‌ అలీ జర్దారీ పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా ఉన్నట్లు సింథియా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఆమె తన ఫేస్‌బుక్‌ పేజీ లైవ్‌ ద్వారా మాట్లాడుతూ.. ఈ ముగ్గురి వ్యవహారాలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వచ్చే వారంలో వాటన్నింటినీ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. 

కాగా.. మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో, మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో వైవాహిక జీవితంపై సింథియా డి రిచీ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ సింథియాపై గత వారం ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సైబర్‌ క్రైమ్‌ విభాగానికి పీపీపీ షెషావర్‌ జిల్లా అధ్యక్షుడు జుల్ఫికర్‌ ఆప్ఘానీ ఫిర్యాదు చేశారు. 

సింథియా గత వారం బెనజీర్‌ భుట్టో గురించి 'ఇన్‌డీసెంట్‌ కరస్పాండెంట్‌ సీక్రెట్‌ సెక్స్‌ లైఫ్‌ ఆప్‌ బెనజీర్‌ భుట్టో’ పుస్తకంలోని కొన్ని భాగాలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పుస్తకంలో బెనజీర్ భుట్టో, ఆమె కుమారుడు బిలావల్ భుట్టో, పార్టీ సీనియర్ నేత షెర్రీ రెహమాన్ గురించి వివరంగా రాశారు.

పీపీపీ నేతలు మద్యం తాగుతూ, మహిళలతో డ్యాన్స్ వేస్తూ.. మోసం చేస్తారని ఆమె ఆరోపించారు. బెనజీర్ భుట్టో మహిళలపై అత్యాచారాలు చేసేవారంటూ ఆమె పేర్కొన్నారు.

కాగా.. అసలు ఎవరీ సింథియా డి రీచీ అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. కానీ.. ఆమె 2009లో మొదటిసారిగా పాకిస్తాన్‌కు పర్యాటకురాలిగా వచ్చారు. తర్వాతి కాలంలో పాకిస్తాన్‌ ప్రధాని యూసఫ్‌ రజా గిలానీ, విదేశాంగ మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌లతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. పీపీపీ కమ్యూనికేషన్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఈమె ఉర్దూ, పంజాబీ భాషలు మాట్లాడతారు. 

ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో నివసిస్తూ.. ఫ్రీలాన్స్‌ ఫిల్మ్‌ మేకర్‌, రచయిత, కాలమిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ మధ్య పీపీపీ అధికారానికి దూరం కావడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ శిబిరంలోకి వెళ్లిన సింథియా పీపీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios